బిజినెస్ ఐడియా: బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? ఇది ట్రై చెయ్యండి..

-

ఇప్పుడు యువత అంతా బిజినెస్ వైపు పరుగులు పెడుతున్నారు..కొత్త బిజినెస్ లు మొదలు పెట్టి లక్షల్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచనలొ ఉన్నారు..తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను పొందే బిజినెస్ లలో ఒకటి సెంద్రీయ ఎరువుల తయారి..ఈ బిజినెస్ ను ఎలా స్టార్ట్ చేయాలి..ఎంత ఇన్వెస్ట్ చెస్తె ఎంత లాభాలు వస్తాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

రోగాలు వస్తున్నాయని.. జనాలు కూడా సేంద్రీయ పద్దతుల్లో పండించిన ఆహార ఉత్పత్తులను కొంటున్నారు. రేటు ఎక్కువైనా సరే వాటినే తీసుకుంటున్నారు. మారుతున్న జీవనశైలిని సేంద్రీయ ఎరువుల వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సేంద్రియ ఎరువు వాడకం వల్ల పంట నాణ్యతను మెరుగవడమే కాదు.. భూమిలో సత్తువ కూడా పెరుగుతుంది. భూములు సారవంతమవుతాయి. సేంద్రియ ఎరువుతో పండించిన పండ్లు, కూరగాయలను తినడం వల్ల శరీరంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడిన పండ్లు, కూరగాయలు తింటే.. ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ఈ మధ్య చాలా మంది ఆర్గానిక్ ఫుడ్‌పై దృష్టిసారించారు. మార్కెట్‌లో ఆర్గానిక్ పంట ఉత్పతులకు డిమాండ్‌తో పాటు రేటు ఎక్కువగా ఉండడంతో.. రైతులు కూడా సేంద్రియ ఎరువుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

సెంద్రీయ ఎరువులను ఎలా తయారు చెయ్యాలి?

చిన్న స్థాయిలో సేంద్రీయ ఎరువుల వ్యాపారానికి రూ.1-5 లక్షలు కావాలి. సేంద్రీయ ఎరువు తయారీ కోసం ఖాళీగా ఉండే ఏదేని భూమి కావాలి. ఆ తర్వాత కొన్ని యంత్రాలు కావాలి. ఇందులో బయో రియాక్టర్, బయో ఫెర్మెంటర్, ఆటో క్లేవ్, బాయిలర్, ఆర్‌ఓ ప్లాంట్, కంపోస్ట్ కుట్టు యంత్రం, కంప్రెసర్, ఫ్రీజర్, కన్వేయర్లు వంటివి ఉంటాయి. సేంద్రీయ ఎరువును తయారు చేయడానికి మీకు గొర్రెల ఎరువు, కోళ్ల ఎరువు, ఆవు పేడ, వ్యవసాయ వ్యర్థాలు, రాక్ ఫాస్ఫేట్ ముడి పదార్థంగా అవసరం అవుతాయి. ఎరువుల తయారీ ప్లాంట్‌కు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌తోపాటు ఎరువుల లైసెన్స్‌ను కూడా బిజినెస్ ను మొదలు పెట్టక ముందు పొందాలి.అప్పుడే మనం తయారు చేస్తున్న ఎరువులకు మంచి మార్కెట్ వుంటుంది.

ఎంత ఆదాయం వస్తుందనేది.. మీ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. పెద్ద పరిశ్రమ అయితే.. ఎక్కువ లాభం వస్తుంది. చిన్న స్థాయిలో స్టార్ట్ చేస్తే.. కాస్త తక్కువ ఉంటుంది. సేంద్రీయ ఎరువుల వ్యాపారంలో మీరు ఖర్చుపై 20-21 శాతం లాభం పొందవచ్చు. అంటే మీరు రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే,లక్ష వరకూ లాభాన్ని పొందవచ్చు.. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమ, ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. రైతుల తో ఎరువుల గురించి వివరిస్తే ఇంకా లాభాలను పొందవచ్చు.. మీకు ఈ ఐడియా ఉంటే మీరు కూడా దీన్ని మొదలు పెట్టవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news