అతి త్వరలోనే ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రైతు బంధు నిధులు జమ అవుతాయని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 87 మంది లబ్ధిదారులకు 30 లక్షల 11 వేల సీఏంఆర్ఎఫ్ చెక్కులు, 124 లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాది ముబారక్ కోటి 30 లక్షల చెక్కుల పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు గారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల సౌకర్యాలు, మిషన్లు, పరికరాలు అన్నీ ఏర్పాట్లు చేశామని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో కాట్రాక్ట్ ఆపరేషన్ల నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. అత్యవసరమైతేనే ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలని, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్యులు, సేవలు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే రూ. 10 కోట్లతో క్యాత్ ల్యాబ్ అందుబాటులోకి తేనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ఆసుపత్రి వైద్యం కై వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టలేని నిరుపేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉడుతా భక్తి కింద ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు గారు చెప్పారు.