బిజినెస్ ఐడియా: ఆరోగ్యకరమైన ఈ ఫుడ్ బిజినెస్ పెడితే.. లాభాలే లాభాలు..!

మీరు ఏదైనా బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే ఈ బిజినెస్ ఐడియాని చూడండి. మహమ్మారి కారణంగా అందరు ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటువంటి సమయం లో మంచిగా డబ్బులు పొందాలంటే సలాడ్ వ్యాపారం బాగుంటుంది. దీని కోసం మీరు రూ.3,000తో బిజినెస్ ని స్టార్ట్ చెయ్యచ్చు.

దీని కోసం మీరు ఒక ఐదు నుండి ఆరు రకాల సలాడ్స్ ని చేస్తే బాగుంటుంది. మీరు ఎంత టేస్టీగా చేస్తే అంత బాగుంటుంది మీ వ్యాపారం. ఇది ఏమి ఊహలు కాదు. నిజంగా అందరు స్టార్ట్ చేస్తున్నారు. ఈ బిజినెస్ చేసిన ఒక ఆమెకు నెలకు రూ.75,000 నుంచి రూ.లక్ష దాకా వస్తోంది.

గ్రామ్ చాట్, మిక్స్‌డ్ కార్న్ , బీట్ రూట్, పాస్తా సలాడ్ లాంటివి అందరు ఇష్ట పడతారు. ఇలా సలాడ్స్ చేసి హోమ్ డెలివరీ చెయ్యచ్చు. ఒక సలాడ్ ని రూ.59 నుంచి రూ.69 వరకూ సెల్ చెయ్యచ్చు. నెలకు రూ.5వేల నుంచి రూ.7వేల లాభం నుండి క్రమణగా బిజినెస్ పెరుగుతుంది. ఇలా ఈజీగా మీరు సంపాదించచ్చు. అది కూడా ఇంట్లో వుండే.

స్థానిక అపార్ట్‌మెంట్ల లో వారికి ఇలాంటివి చేసుకునే టైమ్ ఉండదు. వారికి వీటిని అలవాటు చేస్తే… ఇక వారే మళ్లీ మళ్లీ అడుగుతారు. అలాగే సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని మీ బిజినెస్ ని పెంచుకోవచ్చు. అలానే మీరు ఒక పేజ్ క్రియేట్ చేసుకుని ఆన్ లైన్ ద్వారా సేల్ చెయ్యచ్చు.