సాధారణంగా మనం మార్కెట్లలో ఆపిల్స్, దానిమ్మ వంటి పండ్లను అట్ట పెట్టెల్లో పెట్టి తీసుకెళ్తుండడాన్ని చూస్తుంటాం. ఆ పెట్టెల్లో కాగితం ముక్కల నడుమ పండ్లు ఉంటాయి. అలాగే సున్నితమైన, సులభంగా పగిలిపోయే గాజు, ఇతర వస్తువులను తరలించేందుకు కూడా బాక్సుల్లో కాగితం ముక్కలను వేస్తుంటారు. అయితే అవే కాగితం ముక్కలతో బిజినెస్ చేస్తే.. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభం పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
పేపర్ ష్రెడ్డర్ బిజినెస్ చేసేందుకు ఇండస్ట్రియల్ పేపర్ ష్రెడ్డర్ మెషిన్, పాత పేపర్లు అవసరం అవుతాయి. సదరు మెషిన్‌ను ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ మెషిన్‌ను ఆపరేట్ చేసేందుకు కేవలం ఒక్కరు చాలు. అందువల్ల ఇంట్లోనే ఈ మెషిన్‌తో సులభంగా పనిచేయవచ్చు. ఈ మెషిన్‌లో పాత పేపర్లను పెడుతుంటే.. కాగితాలు సన్నని చిన్న చిన్న ముక్కలుగా కట్ అయి బయటకు వస్తాయి. వాటిని ప్యాక్ చేసి అమ్మాల్సి ఉంటుంది.
ఇక పేపర్ ష్రెడ్డర్ మెషిన్ ధర రూ.65వేల వరకు ఉంటుంది. అలాగే 1 కిలో పాత న్యూస్ పేపర్ల ధర రూ.10 వరకు ఉంటుంది. ఇక ఈ మెషిన్ ద్వారా నిత్యం 250 కిలోల పేపర్లను కట్ చేయవచ్చు. ఈ క్రమంలో కత్తిరించబడిన పేపర్లను కేజీకి రూ.20 చొప్పున అమ్మవచ్చు. అంటే.. 250 కిలోలకు రూ.5వేలు వస్తాయి. ఇందులో ఖర్చులు రూ.3వేలు తీసేసినా.. రూ.2వేలు లాభం ఉంటుంది. అంటే నిత్యం రూ.2వేల చొప్పున నెలకు రూ.60వేలు సంపాదించవచ్చు.
అయితే ఈ బిజినెస్‌కు మార్కెటింగ్ చేయాల్సి ఉంటుంది. పండ్లను, పింగాణీ, గాజు వస్తువులను ఎక్స్‌పోర్ట్ చేసేవారికి ఈ పేపర్లను అమ్మాల్సి ఉంటుంది. వారితో టై అప్ అయితే తరచూ పేపర్‌ను సప్లయి చేసి.. ఆ మేర ఆదాయం పొందవచ్చు. దీంతో ఎక్కువ కాలం వ్యాపారం చేసి సుదీర్ఘకాలం పాటు లాభాలను ఆర్జించవచ్చు..!