మెగాస్టార్ కోసం చరణ్ డైరెక్టర్ కూడా .. వాళ్ళకంటే ముందు ఛాన్స్ వచ్చినా రావచ్చు ..?..!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ ఎవరూ ఊహించరు. ఆ కాంబినేషన్ లో సినిమా అంటే ఆశ్చర్యంతో ఇది నిజమా ..? అని ఫ్యాన్సే షాక్ కి గురౌతారు. అలాంటి కాంబినేషన్ పవన్ కళ్యాణ్ సంపత్ నంది. గతంలో వీళ్ళిద్దరు సినిమా చేయాలనుకొని మల్ళీ ఎందుకో ప్రాజెక్ట్ డ్రాపయింది. అయితే ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి బాబి డైరెక్టర్ అంటే కూడా చాలా మంది షాకయ్యారు. కాని సినిమా అఫీషియల్ గా అనౌన్స్ వస్తే గాని నమ్మలేదు. ఇప్పుడు కూడా ఇలాంటి షాకే మళ్ళి మెగా ఫ్యాన్స్ కి తగిలిందని తెలుస్తుంది.

 

ఏమైంది ఈవేళ అనే ఓ రొమాంటిక్ సినిమా తో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు సంపంత్ నంది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో రచ్చ చేశాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. మద్యలో నిర్మాతగాను మారాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా సీటీమార్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తను ఏకంగా మెగాస్టార్ కోసం కథ రెడీ చేస్తున్నట్టు తెలిపాడు. అంతేకాదు అది తన డ్రీం ప్రాజెక్ట్ అని వెల్లడించాడు. సమాజంలో కీలక పాత్ర పోషించే రజాకార్ల నేపథ్యంలో ఈకథ రాస్తున్నట్టు ఇది చిరు కొసమే సిద్దం చేస్తున్నట్టు రివీల్ చేశాడు.

ఈ కథ పూర్తి చేశాక చిరు ని కలుస్తాడట. ఈ కథ గనక చిరంజీవికి నచ్చితే సంపంత్ నందికి గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టేనని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అలాగే చిరంజీవి ఇప్పటి వరకు చేయని ఒక కొత్త క్యారెక్టర్ చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం సంపంత్ నంది తెరకెక్కిస్తున్న సిటీమార్ కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతుండగా హీరో గోపిచంద్, హీరోయిన్ తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కంప్లీటయ్యాక మెగాస్టార్ ని కథ తో కలుస్తాడట. అయితే సంపత్ నంది ఈ మ్యాటర్ చెప్పినప్పటి నుండి ఫ్యాన్స్ లో ఈ కాంబినేషన్ మీద ఒకటే హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు.