దేశంలో రూ.105కు చేరువలో పెట్రోల్ ధర

-

న్యూఢిల్లీ: దేశంలో ఆయిల్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. రెండు వారాలుగా వరుసగా పెరుగుతున్న ధరలు తాజాగా మరింత పెరిగాయి. జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105కు చేరువలో ఉంది. ఆదివారం జైపూర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.62 పైసలుగా విక్రయాలు జరుగుతున్నాయి. తర్వాతి స్థానంలో ముంబై ఉంది. ముంబై‌లో ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ. 103.36గా ఉంది. ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్‌ ఉంది. ఆదివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.04గా పెట్రోల్ బంకుల్లో విక్రయిస్తున్నారు. మెట్రో నగరాలైన బెంగళూరులో రూ. 100.47, పాట్నాలో రూ. 99.28, త్రివేండ్రంలో రూ. 99.20, చెన్నైలో రూ. 98.40, న్యూఢిల్లీలో రూ. 97.22, కోల్ కతలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.12గా ఉంది.

ఇక డిజిల్ విషయానికొస్తే శనివారంతో పోల్చితే ఆదివారం కూడా పెరిగింది. జైపూర్‌లోనే అత్యధికంగా డీజిల్ ధర ఉంది. జైపూర్‌లో ఈ రోజు లీటర్ డీజిల్ ధర రూ. 97.67గా విక్రయిస్తున్నారు. ఆ తర్వాత భువనేశ్వర్‌లో లీటర్ డీజిల్ రూ. 96.09గా అమ్ముతున్నారు. ముంబైలో రూ. 95.44, చెన్నైలో రూ. 92.58 కాగా హైదరాబాద్‌లో లీటర్ డిజిల్ ధర రూ. 95.89గా ఉంది. రోజుకు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. వాహనాదారులతో పాటు వివిధ సంఘాల నేతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news