వ్యాపారం చెయ్యాలనుకుంటున్నారా…? అయితే అమూల్ నుండి సూపర్ ఛాన్స్..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే అమూల్ నుండి మీకు మంచి అవకాశం. దీనితో మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇక దీని కోసం ఇప్పుడే పూర్తి వివరాలని చూసేయండి.
పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్‌’ మంచి అవకాశాలను ఇస్తోంది. అముల్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫ్రాంచైజీలను స్టార్ట్ చెయ్యాలని అనుకుంది. మీరు ప్రతీనెలా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇది ఇలా ఉండగా మీరు దరఖాస్తు చేసుకోవాలంటే [email protected] కు మెయిల్ చేయాలి. మీరు http://amul.com/m/amul-scooping-parlours వెబ్‌సైట్‌ లో కూడా సమాచారాన్ని పొందవచ్చు.

ఇలా మీరు రాయల్టీ లేదా ఫ్రాంచైజీలను తీసుకోవచ్చు. అయితే ఇలా చేస్తే రెండు లక్షల పెట్టుబడి తో వ్యాపారం ప్రారంభంలోనే మంచి లాభాలను గడించవచ్చని. రూ.5 నుంచి 10 లక్షల వరకు పాల ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టవచ్చని పేర్కొంటున్నారు. ఇక ఫ్రాంచైజ్ ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే… అమూల్ రెండు రకాల ఫ్రాంచైజీలను అందిస్తోంది. వీటి వివరాలు లోకి వెళితే… మొదటిది అమూల్ అవుట్లెట్, అమూల్ రైల్వే పార్లర్ లేదా అముల్ కియోస్క్ ఫ్రాంచైజ్, రెండవది అముల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ ఫ్రాంచైజ్.

ఈ రెండిట్లో మీకు నచ్చినది మీరు చెయ్యొచ్చు. మొదటి దాని కోసం మీరు రూ.2 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. అదే రెండవది కావాలంటే దానికి రూ.5 లక్షలు పెట్టుబడి అవసరం. దీనిలో కంపెనీకి భద్రతగా 25 నుంచి 50 వేల రూపాయలు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది గమనించండి.

ఇక మీకు ఎంత వస్తుంది అనే విషయానికి వస్తే.. MRP ధర ప్రకారం పాల ప్యాకెట్లపై 2.5 శాతం, పాల ఉత్పత్తుల పై 10 శాతం. అలానే ఐస్‌క్రీమ్‌ పై 20 శాతం కమిషన్ ఇస్తుంది. ఇక అమూల్ ఐస్ క్రీమ్ స్కూపింగ్ పార్లర్ ఫ్రాంచైజీ లో ఐస్ క్రీం, మిల్క్ షేక్స్, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, చాక్లెట్, జ్యూస్ లాంటి ఉత్పత్తులపై 50% కమీషన్ మీకు వస్తుంది.

ప్రీ – ప్యాకేజ్డ్ ఐస్ క్రీం మీద 20 శాతం, అముల్ ఉత్పత్తుల పై 10 శాతం కమీషన్ కూడా మీకు వస్తుంది. ఇక మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చెయ్యాలి అంటే దీని కోసం మీకు 150 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అముల్ ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజీ కోసం కనీసం 300 చదరపు అడుగుల ఏరియా కావాలి.

Read more RELATED
Recommended to you

Latest news