ఓటీటీలోనే ‘వి’, హింట్ ఇచ్చిన నాని !

-

నాని నెగటివ్ షేడ్స్ లో నటించిన వి సినిమా అమెజాన్ ప్రైమ్‌ లో రిలీజ్ కావడానికి రంగం సిద్దమయింది. ఇప్పటిదాకా ఇదంతా ప్రచారానికే పరిమితం కాగా ఈరోజు నాని హింట్ ఇచ్చాడు. ఈ వి సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గురించి రేపు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. నాని నటించిన ఒక చిన్న యాడ్ ని తన ఇన్స్టా గ్రామ్ లో అప్లోడ్ చేశాడు.

అయితే ఆగస్టులో మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవుతాయని భావిస్తు వచ్చిన నిర్మాతలు ఇంకా పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ చేయలేదు. ఇప్పటి దాకా కొన్ని సినిమాలు రిలీజ్ అయినా అవన్నీ చిన్న సినిమాలే. అన్నీ 3 కోట్ల బడ్జెట్ కంటే తక్కువ ఉన్న సినిమాలే. ఇక నాని నెగటివ్ షేడ్స్ లో నటించిన ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించాడు. నివేధా ధామస్, అదితీ రావు హైదరీలు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాని ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించారు. రేపు మరి ఏం ప్రకటన చేస్తారో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani) on

Read more RELATED
Recommended to you

Latest news