ఎన్టీఆర్ బయోపిక్ కు ఫ్యాన్సీ ఆఫర్..!

-

Fancy Offer for Balakrishna NTR Biopic movie

నందమూరి బాలకృష్ణ తలపెట్టిన ఎన్.టి.ఆర్ బయోపిక్ తేజ నుండి క్రిష్ చేతుల్లోకి వచ్చాక స్పీడ్ అందుకుందని తెలిసిందే. ఇప్పటికే సినిమాలోని స్టార్ కాస్ట్ అంతా ఫైనల్ అవగా ఓ పక్క షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది. బాలకృష్ణ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరుగా కాగా సినిమా ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తీస్తున్నారట.

బాలీవుడ్ భామ విద్యా బాలన్ ఎన్.టి.ఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తుంది. అంతేకాదు రానా, మహేష్ లాంటి వారు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారని తెలుస్తుంది. సినిమాలో బాలకృష్ణ 64 గెటప్పులలో కనిపిస్తారట. భారీ హంగులతో వస్తున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ సిని, రాజకీయ ప్రస్థావనతో రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సోనీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నుండి 80 కోట్ల వరల్డ్ వైడ్ రైట్స్ ఆఫర్ వచ్చిందట. సినిమా ఖర్చు వచ్చిన ఆఫర్ టాలీ చేసి చూస్తే కచ్చితంగా ఎన్.టి.ఆర్ బయోపిక్ కు సోనీ ఆఫర్ గొప్పదే కాని బాలకృష్ణ మాత్రం అందుకు ఒప్పుకోలేదట. సినిమా సొంతంగానే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. 80 కోట్ల ఆఫర్ కాదన్నాడంటే ఎన్.టి.ఆర్ బయోపిక్ పై బాలయ్య గురి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news