చాలా ఏళ్ల తర్వాత తెలుగు సినిమా ఎక్కువ జాతీయ అవార్డులని సాధించింది. సావిత్రి జీవితం ఆధారంగా దర్శకుడు నాగ అశ్విన్ తెరక్కించిన ‘మహానటి’ చిత్రం జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి ఎంపికైంది. ఇక సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేశ్ ఉత్తమ నటిగా అవార్డు సాధించింది. ఇదే చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ పురస్కారం దక్కడం విశేషం.
మహానటితో పాటు రంగస్థలం, ‘అ!’, ‘చి||ల||సౌ||’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ ఆడియోగ్రఫీకి గాను రంగస్థలం, ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రంగా చి||ల||సౌ|| ఎంపికైంది. అలాగే ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ్ మేకప్ కి గాను ‘అ!’ చిత్రం అవార్డులు దక్కించుకుంది.
అవార్డులు దక్కిన చిత్రాలు
- ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
- ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్(ఉరి)
- ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా(అంధాధున్), విక్కీ కౌశల్(ఉరి)
- ఉత్తమ నటి: కీర్తి సురేశ్(మహానటి)
- ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్‌కిరే(చంబక్)
- ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ(బదాయ్ హో)
- జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
- జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్
- జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్
- ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ(పద్మావత్)
- జాతీయ ఉత్తమ యాక్షన్ చలన చిత్రం: కేజీఎఫ్
- ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)
- ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
- ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌మ్యాన్
- ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్ హో
- ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌రెడ్డి యాకంటి(నాల్: మరాఠీ)
- జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్
- ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి(కన్నడ)
- ఉత్తమ సౌండ్ డిజైనింగ్: ఉరి
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీప్‌ప్లే: అంధాధున్
- ఉత్తమ సంభాషణలు: తారీఖ్(బెంగాలీ)
- ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
- ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్(పద్మావత్: బింటే దిల్)
- ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్, షాహిబ్ సింగ్, తలాహ్ అర్షద్ రేసి, శ్రీనివాస్ పోకాలే
- నర్గీస్ దత్ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)