తప్పుడు పత్రాలు సృష్టించి నాపై కోర్టులో కేసు వేశారు – RGV

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. కాగా, తాజాగా తనపై తప్పుడు పత్రాలు సృష్టించి శేఖర్ రాజు కోర్టులో కేసు వేశారని అన్నారు.

ఆర్జీవి నిర్మించిన లడికి సినిమా ఈ నెల 15 న రిలీజ్ అయిందని, దానిపై శేఖర్ రాజు అనే వ్యక్తి స్టే తెచ్చారని.. దానివల్లే సినిమా ఆగిపోయిందని తెలిపారు.”హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు నాపై ఆలిగేషన్ పెట్టారు.కోర్ట్ ను తప్పుదారి పట్టించి శేఖర్ రాజు స్టే తీసుకున్నాడు.తప్పుడు పత్రలను సృష్టించి నాపై కోర్టులో కేసు వేశారు.దానికి సంబందించిన ఆధారాలు పంజాగుట్ట పోలీసులకు అందించాను.ఇదొక ఆనవాయితీగా మారుతోంది.

సినిమా ఆపడం అనేది బ్యాడ్ థింగ్.ఇలాంటి మరోసారి పునరావృతం అవ్వొద్దు అని పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టాను.ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చిందో.. వారందరూ శేఖర్ రాజు పై కేసులు పెడతారు.వాళ్ళ ఎండ్ చూస్తా… చాలా సీరియస్ గా ఫైట్ చేయబోతున్నాం.శేఖర్ రాజు కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్ చేసుకుందం అనే భావన తో శేఖర్ ఇదంతా చేస్తున్నారు”. అని రాంగోపాల్ వర్మ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news