తిరుపతి కలెక్టర్ కు చంద్రబాబు నాయుడు లేఖ

-

తిరుపతి కలెక్టర్ కు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో అక్రమాలపై జిల్లా కలెక్టరుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 12 డైరెక్టర్ పోస్టులకు జరుగుతున్న ఎన్నికల్లో అక్రమాలు చేసి, దొంగ ఓట్ల వేశారని పోలింగ్ రద్దు చేయ్యాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తిరుపతి టౌన్ బ్యాంక్ బోర్డు ఎన్నికల్లో పోలీసులతో కుమ్మక్కైన అధికార వైసీపీ అక్రమాలకు పాల్పడింది…వైసీపీయేతర అభ్యర్థులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు.

పోలింగ్‌కు కేవలం రెండు రోజుల ముందు పోటీలో ఉన్న పులిగోరు మురళీ కృష్ణా రెడ్డి, బుల్లెట్ రమణ, జెబి శ్రీనివాసులుపై కేసులు పెట్టారు.వైసీపీ మద్దతు ఉన్న అభ్యర్థులకు అనుకూలంగా నకిలీ ఐడీ కార్డులతో దొంగ ఓట్లేయించారని ఫైర్ అయ్యారు.ఎన్నికల్లో పోటీ చేస్తున్న దళిత వర్గానికి చెందిన పి వలముని అనే పోటీదారుని పోలీసులు అదుపులోకి తీసుకోవడం విస్మయకరం…రూ. 350 కోట్ల వార్షిక టర్నోవరుతో.. రూ. 290 కోట్ల ఫిక్సుడ్ డిపాజిట్లు ఉన్న బ్యాంక్ పై వైసీపీ నేతల కన్ను పడిందని చెప్పారు. బ్యాంకు సభ్యుల హక్కులను కాపాడేందుకు ఇవాళ జరిగిన పోలింగ్ ప్రక్రియను రద్దు చేయాలి.నిష్పక్షపాతంగా మరో రోజు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news