నటుడిని మాయ చేసి లక్షలు పిండుకున్న జూనియర్ ఆర్టిస్టు..!!

-

ఇప్పుడు సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి. పెళ్ళి ఒకరితో సంబందాలు పెట్టుకొనేది ఏంతో మందితో నో. ఇది ఎలా వుందంటే అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు అన్నట్లు గా వుంది. రిలేషన్ షిప్ అనేది ఈ రోజుల్లొ చాలా కామన్ గా మారింది. అదే సినిమా హీరోలు, హీరోయిన్లు- మధ్య సంబందాలు- సహజీవనాలు చాలా మామూలుగానే ఎక్కువ వుంటాయి. అలాగే కొంత మంది అమ్మాయిలు పురుషులకు ఉండే లైంగిక వాంఛలను అడ్డం పెట్టుకొని వారిని ముగ్గులోకి దింపి డబ్భులు పిండుకుంటూ ఉంటారు.

రీసెంట్ గా ఒక నటుడు ఇలాగే లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం ఒక నెరజాణ చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది. మోసం చేసింది కూడా ఒక జూనియర్ ఆర్టిస్టు అని అంటున్నారు . ఆమె గతంలోనే  విలాసవంతమైన జీవితం కోసం మోసాలు చేయడం ప్రారంభించిందట.. అందంగా తయారయ్యే ఆమె ఫొటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసేదట. ఇలా నచ్చిన వారిని వల్లో వేసుకొని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చేదట.

ఇక ఒకరోజు సదరు నటుడు యొక్క ఫోన్ నంబర్ ఆమెకు తెలిసిన వారి నుండి సంపాదించి చాటింగ్ చేసిందట.ముందుగా స్నేహం, తర్వాత ప్రేమ ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించడం ప్రారంభించింది. నాలుగు సార్లు హోటల్ లో గడిపిన తరువాత  ఇక నటుడి నుండి  అవసరాల పేరుతో అందినంత దోచుకొని పరారయ్యిందట. ఇప్పటి వరకు ఆమెకోసం అతడు దాదాపు 18 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి మోసపోయినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news