తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను చక్కదిద్దేందుకు అధిష్టానం దిగ్విజయ సింగ్ ని ఏఐసీసీ పరిశీల కుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో దిగ్విజయ సింగ్ సూచనతో సీనియర్లు నేటి సమావేశాన్ని వాయిదా వేశారు. దిగ్విజయ్ సింగ్ మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కి రానున్న నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై దిగ్విజయ్ సింగ్ కి పూర్తి అవగాహన ఉందన్నారు.
అనేక అంశాలపై ఆయన విచారణ చేపట్టాలని కోరారు. గాంధీభవన్ లో పైరవీలకే పెద్ద పీట అని అన్నారు కోమటిరెడ్డి. అలాగే హుజరాబాద్ పరిణామాలు, తనపై వాడిన పదజాలంపై కూడా విచారణ జరపాలని కోరారు. పనిచేసే వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. ఢిల్లీ పెద్దల సూచనతోనే సైలెంట్ గా ఉన్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ లో ప్రతీ కార్యకర్త పిసిసి చీఫ్ తో సమానం అని చెప్పారు కోమటిరెడ్డి.