Acharya: ‘ఆచార్య’ ప్రమోషన్స్ షురూ..ఆసక్తికర విషయాలు చెప్పిన కొరటాల శివ, రామ్ చరణ్

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ జరిగిపోయాయి. త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. నిజానికి ఈ సినిమా ప్రమోషన్స్ ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదని మెగా అభిమానులు అంటున్నారు. వెండితెరపైన తండ్రీ తనయులు చిరంజీవి, రామ్ చరణ్ లను చూసేందుకు అభిమానులు, సినీ లవర్స్ పోటెత్తుతారని అంటున్నారు.

‘భలే భలే బంజార’ సాంగ్ తాజాగా విడుదలై ప్రేక్షకుల చేత విశేషంగా ఆదరించబడుతోంది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ ను డైరెక్టర్ కొరటాల శివ షురూ చేశారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ ప్రోమో బుధవారం విడుదల కాగా, సోషల్ మీడియాలో అది బాగా వైరలవుతోంది.

సదరు వీడియోలో కొరటాల శివ, రామ్ చరణ్ లను యాంకర్ పలు ప్రశ్నలు అడిగారు. వారు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా ‘భలే భలే బంజారా’ సాంగ్ గురించి రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తన తల్లి, చిరంజీవి తల్లి .. ఇద్దరూ సాంగ్ లో ఎవరూ బాగా డ్యాన్స్ చేశారని పోటాపోటీగా సెట్ లో చూశారని వివరించారు. కొరటాల శివలో తనకు నచ్చిన విషయాలను రామ్ చరణ్ చెప్పారు.

కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాకు సంబంధంచిన ఆసక్తికర విషయాలను వివరించారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూతో అఫీషియల్ గా ‘ఆచార్య’ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. త్వరలో చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివల ఇంటర్వ్యూ కూడా ఉండబోతున్నదని అర్థమవుతోంది. బుధవారం సాయంత్రం 04.05 గంటలకు కంప్లీట్ ఇంటర్వ్యూను విడుదల చేయనున్నారు మేకర్స్.