జీవిత–రాజశేఖర్ బయటే బావుంటారా.. ఇంట్లో అంత సీన్ లేదా..?

జీవిత- రాజశేఖర్.. ఈ పేర్లను విడదీసి చూడలేం.. విడదీసి చదవలేం.. తలంబ్రాలు సినిమాతో మొదలైన వీరి పరిచయం ఆ తర్వాత క్రమంగా ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరికి ఒకరుగా జీవించారు. తెలుగు సినిమా జంటల్లో ముచ్చటైన జంట ఇది. జీవితా-రాజశేఖర్‌ల దాంపత్య జీవితం ఒక సినిమా అయితే, ఆ సినిమాకు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, మాటలు అన్నీ జీవితానే.

సినిమాల్లోనే కాదు, సమాజంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న పవర్‌ఫుల్‌ ఉమెన్‌కు పర్‌ఫెక్ట్‌ ఉదాహరణ జీవిత. ఇక ఈ జంట బయటకు వచ్చినా అంతే.. రాజశేఖర్ ను ఏమి అడిగినా.. ఆ ఏంటి జీవితా అంటూ ఆమె సలహానే అడుగుతారు. దీనిపై భలే సెటైర్లు కూడా వచ్చాయి. అయితే ఇదంతా కేవలం పైపైనే అని.. వాస్తవానికి వీరిద్దరి మధ్య ప్రస్తుతం అంత ప్రేమ లేదని ఓ టాక్ ఉందట.

ఈ విషయం గురించి ఇటీవల ఓ ఛానళ్లో ఆమె వివరణ ఇచ్చారు… ఆమె ఏమన్నారంటే.. నేను మొదటిసారి వింటున్నా. ఈ విషయం నాకూ తెలియదన్నారు. రాజశేఖర్‌గారిని నచ్చని విషయం చేయమని పదికోట్ల రూపాయలు ఇచ్చినా ఆయన చేయరట. రాజశేఖర్ చాలా ఓపెన్‌ హార్ట్‌. కొందరితో బేధాభిప్రాయాలు వచ్చినా ఆ కాసేపు అలా ఉంటారు. మళ్లీ ఏ ఫంక్షన్‌లో కనిపించినా, చాలా చక్కగా మాట్లాడతారట.

ఇక రాజశేఖర్‌గారి జీవితంలో ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌, అమ్మానాన్న, అక్కా, చెల్లి అన్నీ తానే అంటోంది జీవిత. వాళ్ల కుటుంబం అంతా చెన్నైలోనే ఉంటారు. ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా తనతోనే చర్చిస్తారట. ప్రతి మనిషికీ కోపం అనేది ఉంటుంది. కాకపోతే ఆయనకు ఇంకాస్త ఎక్కువంతే. ‘ఇది ఇలా చేయండి’ అని నాలుగైదు సార్లు చెబుతారు. వినకపోతే అక్కడ ఎవరున్నా కోపం వస్తుంది. అప్పుడు వాళ్లను శిక్షించరు. తనని తాను శిక్షించుకుంటారు. రెండు రోజులు తినడం మానేస్తారు. మా ఇద్దరి మధ్య సఖ్యత లేదన్నవారిని మా ఇంటికి పంపండి. నెల రోజులు ఉండీ అన్నీ చూస్తారు..అంటూ సరదాగా సవాల్ విసిరింది జీవిత.