అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మి 8 లాంచ్‌.. ధ‌ర ఎంతంటే..

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమిసరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ‘రెడ్‌మి 8’ పేరుతో మ‌రో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్‌ చేసింది. రెడ్‌మి 7కి అప్డేట్ వెర్షన్గా దీన్ని తీసుకొచ్చింది. ఏఐ డ్యూయల్‌ కెమెరాలతో 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది లభించనుంది. ఎంఐ .కామ్‌, ఎంఐ సోర్స్‌,ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అక్టోబర్‌ 12నుంచి కస‍్టమర్లకు అందుబాటులోకి రానుంది. ధ‌ర విష‌యానికి వ‌స్తే.. 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ ధర రూ. 7,999 ఉండ‌గా.. 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ రూ. 8,999గా నిర్ణ‌యించారు.

ఇక ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. రెడ్‌మి 8 6.22 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 439 సాక్‌, ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9, 720×1520 పిక్సెల్స్‌రిజల్యూషన్‌, 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌, 512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 12+2 ఎంపీ ఏఐ రియల్‌ డ్యుయల్‌ కెమెరా, 8 ఎంపీ ఏఐ సెల్పీకెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న‌ట్టు తెలుస్తోంది..