హోం టూర్ తెచ్చిన తంటా.. నటుడు రోబో శంకర్​కు రూ.2.5 లక్షల జరిమానా

-

సినిమా సెలబ్రిటీలు ఓవైపు సినిమా షూటింగుల్లో బిజీ ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్​గా ఉంటున్నారు. కొంతమంది ఏకంగా యూట్యూబ్​లో ఛానెల్ స్టార్ట్ చేసి దాని ద్వారా సంపాదిస్తున్నారు కూడా. అలా చాలా మంది సెలబ్రిటీలు ఇప్పటికే తమ హోం టూర్ వీడియోలు చేసి యూట్యూబ్​లో పెట్టారు. ఇలా హోం టూర్ వీడియోలు కొంత మంది సెలబ్రిటీలకు ముప్పు కూడా తెచ్చిపెట్టాయి. ఈ జాబితాలో తాజాగా తమిళ నటుడు రోబో శంకర్ చేరారు. హోం టూర్​ వీడియో ఆయనకు తంటా తెచ్చిపెట్టింది.

రోబో శంకర్ ఇటీవల హోంటూర్‌ పేరుతో తన నివాసంలో ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అందులో.. అలెగ్జాండ్రిన్‌ పారాకీట్‌ అనే చిలుకలు పంజరంలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గురువారం రెండు చిలుకలను స్వాధీనం చేసుకుని గిండిలోని పార్కులో అప్పగించారు. అప్పుడు రోబో శంకర్‌, ఆయన భార్య శ్రీలంకలో ఉండటంతో దర్యాప్తునకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

సోమవారం అటవీశాఖ అధికారుల ఎదుట హాజరై రోబో శంకర్‌ వివరణ ఇచ్చారు. తన భార్య స్నేహితురాలు మూడేళ్ల క్రితం ఈ చిలుకలను ఇచ్చినట్లు తెలిపారు. వీటిని పెంచేందుకు అటవీశాఖ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదని, ఇందుకు క్షమాపణ కోరుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో అధికారులు వారిపై కేసు నమోదు చేయకుండా రూ.2.5 లక్షల జరిమానా విధించారు.

Read more RELATED
Recommended to you

Latest news