ఆ సినిమాలో నటించి చాలా పెద్ద తప్పు చేశా: నయనతార

-

తనకు కథ ఒకలా చెప్పి.. మరోలా సినిమాలో చూపించారని.. తన పాత్రను కూడా కుదించారని నయనతార పేర్కొంది. అందుకే.. ఆ సినిమాకు ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశానని చెప్పింది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ నయనతార. ఆమెకు ప్రస్తుతం స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువ క్రేజ్ ఉంది. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్న నయనతార.. ఓ ఇంటర్వ్యూలో తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. తన కెరీర్ ఆరంభంలో చేసిన గజినీ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపింది నయన్. గజినీ సినిమా చేయడం తన కెరీర్‌లో ఓ చెత్త నిర్ణయమంటూ తెలిపింది. గజినీ సినిమా మురుగదాస్ డైరెక్షన్‌లో వచ్చిన సంగతి తెలిసిందే.

Actress Nayanatara criticizes on her movie gajini

అయితే.. మురగదాస్.. తన పాత్ర గురించి ఒకలా చెప్పి.. సినిమాలో ఇంకోలా చూపించారట. గజినీలో నయనతార సెకండ్ హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే కదా. తనకు కథ ఒకలా చెప్పి.. మరోలా సినిమాలో చూపించారని.. తన పాత్రను కూడా కుదించారని నయనతార పేర్కొంది. అందుకే.. ఆ సినిమాకు ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేశానని చెప్పింది. అయితే.. ఆ సినిమా తనకు మంచి అనుభవం ఇచ్చిందని.. అప్పటి నుంచి ఏ సినిమాలో నటించాలన్నా కాస్త ఆచీతూచీ అడుగేశానని చెప్పింది.

అలాగే.. తను నటించిన చంద్రముఖి గురించి కూడా మాట్లాడుతూ.. చంద్రముఖిలో చిన్న పాత్ర చేసినప్పటికీ.. తనకు మంచి పేరు వచ్చిందని పేర్కొంది. అయితే.. ఆ సినిమాలు వచ్చి దశాబ్దం దాటిన తర్వాత నయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చే మొదలైంది.

నయనతార ప్రస్తుతం.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన సైరానరసింహరెడ్డి సినిమాలో నటిస్తోంది. తమిళంలోనూ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన దర్బార్ అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాను మురుగదాసే డైరెక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా మరో రెండు మూడు సినిమాలకు కూడా నయన్ సైన్ చేసింది. ప్రస్తుతం సినిమాలతో ఫుల్లు బిజీ బిజీగా ఉంది నయన్.

Read more RELATED
Recommended to you

Latest news