ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ 2015 నుంచి ప్రపంచంలోని టాప్ 10 ఎయిర్‌పోర్టుల జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే 2019 సంవత్సరానికి కూడా ఎయిర్‌హెల్ప్ ఆ జాబితాను విడుదల చేయగా.. అందులో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 8వ స్థానం దక్కింది.
ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ బహుళ జాతి కార్పొరేట్ సంస్థలకు నెలవైన హైదరాబాద్ మహానగరం మరో ఖ్యాతిని సొంతం చేసుకుంది. ప్రపంచంలోని అత్యుత్తమమైన విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 8వ స్థానం దక్కింది. ఈ జాబితాలో అమెరికా, యూకేలకు చెందిన ఏ ఎయిర్‌పోర్టు కూడా చోటు దక్కించుకోలేకపోయాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలో ఉన్న టాప్ 10 ఎయిర్ పోర్టులలో శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు చోటు సంపాదించుకుంది.
ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ 2015 నుంచి ప్రపంచంలోని టాప్ 10 ఎయిర్‌పోర్టుల జాబితాను విడుదల చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే 2019 సంవత్సరానికి కూడా ఎయిర్‌హెల్ప్ ఆ జాబితాను విడుదల చేయగా.. అందులో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు 8వ స్థానం దక్కింది. ఇక ఈ జాబితాలో మొదటి స్థానంలో ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఉండగా, రెండో స్థానంలో జపాన్‌లోని టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం, మూడో స్థానంలో గ్రీస్‌లోని ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు నిలిచాయి. ఇక ఆ తరువాత జాబితాలో వరుసగా.. అఫోన్సో పెనా అంతర్జాతీయ విమానాశ్రయం (బ్రెజిల్) 4వ స్థానంలో, గాన్స్ లెచ్ వలేసా ఎయిర్‌పోర్టు (పోలాండ్) 5వ స్థానంలో, షెరెమెటేవో అంతర్జాతీయ విమానాశ్రయం (రష్యా) 6వ స్థానంలో, షాంఘి ఎయిర్‌పోర్టు సింగపూర్ 7వ స్థానంలో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (భారత్) 8వ స్థానంలో, టెనెరిఫె నార్త్ ఎయిర్‌పోర్టు (స్పెయిన్) 9వ స్థానంలో, విరాకోపస్/కాంపినస్ అంతర్జాతీయ విమానాశ్రయం (బ్రెజిల్) 10వ స్థానంలో నిలిచాయి.
ఎయిర్‌హెల్ప్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో విమానాల ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎయిర్‌పోర్టులకు ర్యాంకింగ్‌లను ఇస్తుంది. ఈ క్రమంలోనే 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో ఎయిర్‌హెల్ప్ తాజాగా సర్వే జరిపి పై జాబితాను ప్రకటించింది. అందులో హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 8వ స్థానం దక్కడం విశేషం. ఇక ఎయిర్‌పోర్టులతోపాటు ఎయిర్‌హెల్ప్ సంస్థ ఎయిర్‌లైన్స్ కంపెనీలకు కూడా ర్యాంకింగ్స్ ఇచ్చింది. అందులో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్‌లైనర్‌గా ఖతార్ ఎయిర్‌వేస్ మొదటి స్థానంలో నిలవగా, అమెరికన్ ఎయిర్‌లైన్స్ (2), ఏరో మెక్సికో ఎయిర్‌లైన్స్ (3) తరువాతి స్థానాల్లో నిలిచాయి.