మూడ్రోజుల్లో ఆదిపురుష్ కలెక్షన్స్ రూ.340 కోట్లు

-

ఆదిపురుష్ సినిమా విడుదలై మూడ్రోజులుగా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 16వ తేదీన ప్ర‌పంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా.. మూడు రోజుల్లో రూ.340 కోట్లు సాధించింది. రికార్డు ఓపెనింగ్స్​తో ప్రారంభమైన ‘ఆదిపురుష్’​ బాక్సాఫీస్​ జర్నీ.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా.. వీకెండ్​లో కలెక్షన్ల జోరు కొనసాగించింది.

నెగిటివ్ టాక్​లోనూ ఆదిపురుష్ కలెక్షన్ల సునామీ సృష్టించడం ప్రభాస్​కు ఉన్న క్రేజ్​ను తెలియజేస్తోంది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్ల గ్రాస్​​ వసూళ్లు సాధించింది. రెండో రోజు రూ.100 కోట్లు.. మూడో రోజు రూ. 100 కోట్ల నెట్​ కలెక్షన్లు రాబట్టింది. ఈ మేరకు ఆదిపురుష్​ నిర్మాణ సంస్థ టీ-సిరీస్​ అధికారికంగా ప్రకటించింది. ‘ఆదిపురుష్’​ మూడు రోజులు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

ఆదిపురుష్​ కలెక్షన్లు (వరల్డ్​ వైడ్​) :

  • తొలి రోజు – రూ. 140 కోట్లు
  • రెండో రోజు – రూ. 100 కోట్లు
  • మూడో రోజు – రూ. 100 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news