పాలమూరు ప్రాజెక్ట్ పూర్తికాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుపడ్డారు – సీఎం కేసీఆర్

-

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవం నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా నేడు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు లోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ మొక్కలు నాటారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. గోదావరి నీటిని వందల ఫీట్లు వేసిన బోర్లలో నీళ్లు పడేవి కావన్నారు. చేవెళ్ల ప్రాంతానికి రాబోయే కొద్ది రోజులలోనే నీళ్లు అందిస్తామన్నారు.

పాలమూరు ప్రాజెక్టును పూర్తికాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుపడ్డారని.. లేదంటే ఇప్పటికే పూర్తి అయిపోయేదన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనన్నారు. ఇక పుడమి తల్లికి వెలకట్టలేని ఆభరణం హరితహారం అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో 7.7% పచ్చదనం పెరిగిందని తెలిపారు. గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news