23 ఏళ్ల తర్వాత.. ఆ హీరోయిన్‌తో రజనీకాంత్ సినిమా..

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘నరసింహ’ తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లో ‘పడయప్ప’ కాగా తెలుగులో ‘నరసింహ’గా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఇప్పటికీ ఈ చిత్రం టీవీల్లో వస్తే చాలు..జనాలు చూసేస్తుంటారు. ఇందులో రజనీకాంత్-రమ్యకృష్ణ కాంబినేషన్ సీన్స్ జనాలకు బాగా నచ్చాయి.

‘నరసింహా’, ‘నీలాంబరి’లుగా రజనీకాంత్, రమ్యకృష్ణలు ఆయా పాత్రలలో అదరగొట్టేశారు. రెండు పాత్రలకు ప్రాణం పోసి సినీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేశారు. 1999లో ఈ చిత్రం విడుదల కాగా ఈ కాంబినేషన్ 23 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో రిపీట్ కానుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్’ పిక్చర్ లో రమ్యకృష్ణ నటిస్తు్న్నది.

‘బీస్ట్’ తర్వాత నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఇందులో రమ్యకృష్ణ, రజనీకాంత్ కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

తాను ‘జైలర్’లో నటిస్తున్నానని తాజా ఇంటర్వ్యూలో రమ్యకృష్ణ స్పష్టం చేసింది. దాంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత వీరిరువురి కాంబోలో పిక్చర్ వస్తుండటం పట్ల హ్యాపీగా ఫీలవుతున్నారు సినీ లవర్స్.

సన్ పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. రజనీకాంత్ వెరీ డిఫరెంట్ అవతార్ లో ఈ పిక్చర్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీ రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని దర్శకుడు నెల్సన్ దిలీప్ చెప్తున్నారు.