చత్రపతి శివాజీ మహారాజ్ గా అక్షయ్ కుమార్..

-

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రముఖ దర్శకుడు, నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో అక్షయ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గా కనిపించనున్నారు అయితే ఈరోజు ఈ చిత్రం షూటింగ్ ముంబైలో ప్రారంభమైన సందర్భంగా పలు ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు ఈ హీరో..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు అంటే ఎంత బిజీ షెడ్యూల్లో గడుపుతున్నాడో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అలాగే వచ్చే ఏడాది రాబోతున్న చిత్రాల షూటింగ్లో కూడా ఏమాత్రం తీరిక లేకుండా ఉంటున్నాడు.. ఈ క్రమంలో మరో చారిత్రాత్మక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు అక్షయ్.. తొలిసారిగా మరాఠీ చిత్రంలో నటిస్తున్నారు. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఖురేషి ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.. మూవీకి వేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్ టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రను పోషిస్తున్నారు. ఈరోజు మూవీ ఫస్ట్ షెడ్యూల్‌ను ముంబైలో ప్రారంభించారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

“ఈ రోజు నేను మరాఠీ చిత్రం ‘వేదాత్ మరాఠే వీర్ దౌడలే సత్’ షూటింగ్‌ను ప్రారంభిస్తున్నాను. ఇందులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీ పాత్రను పోషించడం నా అదృష్టం. ఆయన జీవితం, తల్లి జిజావు ఆశీర్వాదంతో ప్రేరణ పొందాను. నా వంతు కృషి చేస్తాను.. అలాగే మీ ఆశీర్వాదం కూడా మాపై ఉండాలి” అని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news