శంకర్ అతన్ని రిపీట్ చేస్తున్నాడు

-

2.ఓ తర్వాత శంకర్ చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఇండియన్ 2. రెండు రశాబ్ధాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వల్ గా ఈ మూవీ వస్తుంది. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, శింభు లాంటి స్టార్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ నటిస్తాడని తెలుస్తుండగా ఇప్పుడు అతని ప్లేస్ లో అక్షయ్ కుమార్ వచ్చి చేరాడని అంటున్నారు.

2.ఓలో పక్షిరాజుగా అక్షయ్ కుమార్ అలరించాడు. ఇండియన్ 2లో కూడా విలన్ గా అక్షయ్ ను సెలెక్ట్ చేశారట. అజయ్ దేవగన్ కు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా ఈ ఇయర్ దీవాళికి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా కూడా రెహమాన్ బదులుగా అనిరుద్ ను సెలెక్ట్ చేశాడు శంకర్. మరి 2.ఓ ఎలాగు నిరాశపరచగా కనీసం ఇండియన్ 2 అయినా అంచనాలను అందుకుంటుందో లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news