రకుల్ పై నెటిజన్ అభ్యంతకర వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన రకుల్..!

-

Rakul preet singh counter attack to the netizen tweet led to troll rakul

రకుల్ ప్రీత్ సింగ్… చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ.. ప్రకటనల్లో నటిస్తూ.. మోడలింగ్ చేస్తూ.. చివరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించింది. తెలుగు, తమిళం, హిందీ లో పలు చిత్రాలు చేసిన రకుల్ కు ప్రస్తుతం సినిమా ఆఫర్లు అయితే అంతగా లేవు. అయినప్పటికీ.. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఎలా అనేగా మీ డౌట్. పైన ఫోటో చూశారు కదా. రకుల్ వేసుకున్న డ్రెస్. తను పొట్టి డ్రెస్సు వేసుకొని కారు దిగుతుండగా.. ఎవరో తమ మొబైల్ తో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెట్టారు. ఓ నెటిజన్ మరింత ముందుకెళ్లి… కారులో పని(సెషన్) అయిపోయాక ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయింది రకుల్ అంటూ తను నిక్కర్ తో ఉన్న ఫోటోను కూడా పెట్టి ట్వీట్ చేశాడు.

సాధారణంగా నెటిజన్లు పెట్టే ట్వీట్లకు ఏ సెలబ్రిటి కూడా రిప్లయి ఇవ్వరు. లైట్ తీసుకుంటారు. కానీ.. రకుల్ కాస్త వేరయ్యా.. అన్నట్టుగా… ఆ ట్వీట్ కు దిమ్మదిరిగే రిప్లయి ఇచ్చింది రకుల్. మీ అమ్మ కూడా కారులో చాలాసార్లు సెషన్స్ చేసినట్టుంది. దానిలో నువ్వు ఎక్స్ పర్ట్ వి కదా. ఇలాంటి వాళ్లు ఉన్నన్ని రోజులు మహిళలకు సేఫ్టీ లేదు. సమానత్వం, భద్రత మీద ఎన్ని చర్చలు జరిగినా వృథానే… అంటూ మనోడికి రిప్లయి ఇచ్చింది రకుల్.

ఆ ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. కొంతమంది నెటిజన్లు అలా కామెంట్ చేసిన నెటిజన్ ను తిడుతుండగా… రకుల్ మాట్లాడిన తీరును చూసి కూడా మరికొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. అతడికంటే బుద్ధి లేదు.. నీ బుద్ధి ఏమైంది.. నీదేం భాష.. అంటూ రకుల్ ను ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఆ నెటిజన్ అయితే.. వెంటనే తను చేసిన ట్వీట్లు, తన ప్రొఫైల్ పిక్ అన్నీ డిలీట్ చేశాడు.

తనపై ట్రోల్ చేస్తున్న నెటిజన్లకు మరో దిమ్మతిరిగే ట్వీట్ పెట్టింది రకుల్. నా విలువల గురించి మాట్లాడే వాళ్లు ముందు మహిళల మీద ఇష్టమున్నట్టు మాట్లాడే వాళ్లను ఎందుకు అడగరు. మహిళలపై అసభ్యకర కామెంట్లు చేసేవాళ్లకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ల ఫ్యామిలీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైతే వాళ్లు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు. ఈ విషయం వాళ్ల అమ్మకు తెలిసి ఉంటే అతడి చెంప చెల్లుమనిపిస్తుంది. అది మాత్రం గ్యారెంటీ అంటూ రకుల్ నెటిజన్ల నోరు మూయించింది. ఇప్పటి వరకు ఈ ట్రోలింగ్ కాస్త ఆగినా.. చూద్దాం.. ఎంతవరకు వెళ్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news