పాపం ఆ హీరోయిన్ చేతులో మోసపోయిన అల్లరి నరేష్.. నిజమేనా..?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో అల్లరి నరేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఈయన సినిమాలు గతంలో ప్రేక్షకులను సైతం కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవి. అయితే రాను రాను కామెడీకి కాస్త ప్రేక్షక ఆదరణ తగ్గడంతో ఈమధ్య కాలంలో అలాంటి సినిమాలను వదిలేసి విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అల్లరి నరేష్. ఇక అంతే కాకుండా పలు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లలో కూడా నటించారు. ఇక చివరిగా నాంది చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే అల్లరి నరేష్ ఒక హీరోయిన్ చేతిలో దారుణంగా మోసపోయినట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

అల్లరి నరేష్ ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కేవలం సినిమాల విషయంలో తప్ప మరే ఇతర విషయంలో కూడా ఎప్పుడు రియాక్ట్ కారు. ఇక ఇండస్ట్రీలో ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయినట్లు సమాచారం నరేష్ కెరీర్ మొదట్లో ఒక హీరోయిన్ ని చాలా ఇష్టపడ్డాడట ఆ హీరోయిన్ కూడా నరేష్ ను మొదట ప్రేమించినట్లు నటించిందట. అలా వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉండడమే కాకుండా మంచి విజయాలను కూడా అందుకున్నారు. ఇక ఆ సమయంలో అల్లరి నరేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. అలా ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాలు ప్రేమించుకోవడమే కాకుండా చట్టపట్టలేసుకొని బాగా తిరుగుతూ ఎంజాయ్ చేసినట్లు సమాచారం.

అయితే ఒకసారి నరేష్ వివాహం చేసుకుందాము అనేసరికి ఆ హీరోయిన్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా నీ లాంటి కామెడీ ఫెలో తో నా పెళ్లా అంటూ నవ్వుకుందట. ఇక తరువాత ఆమె నరేష్ ప్రాణ స్నేహితుడు అయినటువంటి మరొక నటుడు ని ప్రేమించి వివాహం చేసుకున్నది. అయితే ప్రస్తుతం ఇమే ఒక బిడ్డకు కూడా తల్లి అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రమే వైరల్ గా మారుతోంది.. అయితే ఇప్పటికీ నరేష్ ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరా అంటూ అభిమానులు సైతం తెగ ఆరా తీస్తున్నారు. మరి ఇవన్నీ నిజమో కాదో తెలియాలి అంటే నరేష్ స్పందించాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news