ప్రభాస్ – ఎన్‌టి‌ఆర్ లకి ఒకే సారి బన్నీ స్పెషల్ షో .. ??

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో సన్నిహిత సంబంధాలు చాలా బాగానే ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో ‘నా పేరు సూర్య’ లాంటి దారుణమైన డిజాస్టర్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమా చేసి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అల్లు అర్జున్ అందుకొన్నాడు. ఇటీవల రిలీజైన ఈ సినిమా మొట్టమొదటి షో కి సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో ఓపెనింగ్స్ తో పాటు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమా హాల్ హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. సినిమా విజయం సాధించడంతో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న బన్నీ స్నేహితులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ అయితే స్పెషల్ గా ఒక పూల బొకే తో పాటు లెటర్ కూడా పంపి బన్నీ కి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సోషల్ మీడియాలో…అల వైకుంఠ‌పుర‌ములో సినిమాలో బ‌న్నీ ఎఫ‌ర్ట్ లెస్.. టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడ‌ని.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న ర‌చ‌నా ప‌ఠిమ‌ను చూపించాడ‌ని.. ఈ సినిమా చూడ‌టం ప్రేక్ష‌కుల‌కు ఎంతో సంతృప్తిని ఇస్తుంద‌ని తార‌క్ అన్నాడు.

 

ఈ సంద‌ర్భంగా బ‌న్నీని బావా అని.. త్రివిక్ర‌మ్‌ను స్వామీ అని సంబోధించాడు తార‌క్. ‘అల వైకుంఠ‌పుర‌ములో’ సినిమాలో బ‌న్నీ ఎఫ‌ర్ట్ లెస్.. టెర్రిఫిక్ పెర్ఫామెన్స్ ఇచ్చాడ‌ని.. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌న ర‌చ‌నా ప‌ఠిమ‌ను చూపించాడ‌ని.. ఈ సినిమా చూడ‌టం ప్రేక్ష‌కుల‌కు ఎంతో సంతృప్తిని ఇస్తుంద‌ని తార‌క్ అన్నాడు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీని బావా అని.. త్రివిక్ర‌మ్‌ను స్వామీ అని సంబోధించాడు తార‌క్. ఇదే తరుణంలో ప్రభాస్ కూడా శుభాకాంక్షలు చెప్పినట్లు సమాచారం. దీంతో ప్రభాస్ – ఎన్‌టి‌ఆర్ లకి ఒకే సారి బన్నీ ‘అల వైకుంఠ‌పుర‌ములో’ స్పెషల్ షో వేసే ఆలోచనలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.