కొత్త ఇల్లు కొన్న అలియా భట్.. ఖరీదు తెలిస్తే షాక్..!

-

ప్రముఖ బాలీవుడ్ నాచురల్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే గత ఏడాది క్రితం తాను ప్రేమించిన రణబీర్ కపూర్ ను వివాహం చేసుకొని పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన కుటుంబంతో కలిసి జీవించడానికి కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇకపోతే తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఆలియా భట్ ఇటీవల కొత్త ఆస్తిని కొనుగోలు చేసింది.

ఆలియా నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్ షైన్ ప్రైవేట్ లిమిటెడ్ వెస్ట్ బాంద్రాలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది ఇక దీని విలువ అక్షరాలా రూ.37.80 కోట్లు. ఇకపోతే మరో రెండు ఇళ్ళను కొనుగోలు చేసి తన సోదరికి బహుమతిగా కూడా ఇచ్చినట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ అపార్ట్మెంట్ విస్తీర్ణం 2497 చదరపు అడుగులు ఇక ఈ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ దాదాపు రూ.2.26 కోట్లు. మరొకవైపు ప్రైజ్ సర్టిఫికెట్ ద్వారా సోదరీ షాహీన్ భట్ కి రెండు ఇళ్ళను బహుమతిగా ఇచ్చిందని సమాచారం. ఇక దీని విలువ 7.68 కోట్లు అని సమాచారం ముంబైలోని ఏ బి నాయర్ జుగు రోడ్డులోని జిగి అపార్ట్మెంట్స్ తో ఈ ఇల్లు ఉంది.

మొదటి ఇల్లు 1194 చదరపు అడుగులు ఉండగా రెండో ఇల్లు 889.75 చదరపు అడుగులు అని సమాచారం. ఇక వీటికి 30.7.5 లక్షల స్టాంపు డ్యూటీ ఇచ్చారట. అంతే కాదు ఇందులో కారు పార్కింగ్ కూడా ఉందని సమాచారం. కోట్లు ఖర్చుపెట్టి చెల్లికి ఇళ్లను బహుమతిగా అందివ్వడంపై ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news