తండ్రి మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఈ చిత్రంలో రాంచరణ్ సరసన ఆడిపాడనుందీ భామ. ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆలియా, మీడియాతో మాట్లాడుతున్న వేళ, మీకు ఏ హీరో స్టయిల్ నచ్చుతుందన్న ప్రశ్న ఎదురైంది.
దీనికామె తడుముకోకుండా విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’లో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుని ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో బిజీగా ఉన్న ఆలియా, హీరోయిన్స్ లో తనకు అనుష్క శర్మ స్టయిల్ ఇష్టమని, హీరోలలో విజయ్ దేవరకొండ స్టయిల్ ఎంతో సూపరని చెప్పింది.