అల్లువారబ్బాయి మెగా కుటుంబం నుండి దూరం కావాలనుకుంటున్నాడా.. ఏమో.. తనకంటూ ప్రత్యేకమైన ఉనిక, ఇమేజ్ కోరుకుంటున్నట్లు ఇటీవలి ఇంటర్వ్యూలు తెలియజేస్తున్నాయి.
అల్లు అర్జున్ – ‘గంగోత్రి’ నుండి ‘అల..!’ వరకు ప్రతీ సినిమాలోనూ పరిణితి కనబర్చి పైకొచ్చిన హీరో. మెగాస్టార్ చిరంజీవికి అల్లుడుగా పరిచయమైనా, తనదంటూ ఓ ఇమేజ్ తయారుచేసుకోవడంలో కృతకృత్యుడయ్యాడు ఎఎ.
‘అల..వైకుంఠపురంలో..!’ అర్జున్ 20వ సినిమా. సంక్రాంతి బరిలో నిలిచి, గెలిచిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ మీది నమ్మకంతోనే ముందునుంచీ ఈ సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు అర్జున్. అనుకున్నట్టుగానే ఫలితం రావడంతో ఆనందంలో మునిగితేలుతున్నారు అల్లు వారందరూ.
అయితే, ఈ సినిమా ప్రమోషన్లలలో భాగంగా పలు పత్రికలకు, చానెళ్లకు ముఖాముఖి ఇచ్చిన అర్జున్, కొంచెం తేడాగా మాట్లాడాడు. చిరంజీవి గురించి టాపిక్ వచ్చినా, పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆయన అభిమానిని అన్న ఒక్క మాట తప్ప, ఇంతకుముందులా ‘ఓన్’ చేసుకుని చెప్పలేదు. పవన్‌కళ్యాణ్ గురించి కూడా అంతే.. ఇక రామ్‌చరణ్ సరేసరి. ఎందుకిలా? ఇంకా ఆశ్యర్యకరమైన విషయమేమిటంటే.., ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన మ్యూజికల్ నైట్‌లో, తన తండ్రి గురించి చెబుతూ, ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఆ సందర్భంగానే ‘‘ మా నాన్న డబ్బులు దొబ్బేస్తాడని అంటారు కొందరు…’’ అంటూ షాకింగ్‌గా అన్నాడు. ఇండస్ట్రీలోనే కాకుండా, జనంలో కూడా అది తర్వాత తీవ్ర చర్చకు దారితీసింది. ఎవరి డబ్బులు దొబ్బేసాడని ఈ మాటలొచ్చాయో తెలియదు గానీ, ఇది ముమ్మాటికీ చిరంజీవి కుటుంబాన్ని ఉద్దేశించే వ్యాఖ్యానించాడని పరిశ్రమ వర్గాల్లో గుసగుసలు. కావచ్చు.. ఎందుకంటే, చిరంజీవి మెగాస్టార్‌గా వెలుగొందుతున్నప్పుడు, ఆయన కాల్షీట్లు, ఆర్థిక వ్యవహారాలు మొత్తం అల్లు అరవిందే చూసేవాడని అందరికీ తెలుసు. అంతెందుకు? ప్రజారాజ్యం పార్టీ పెట్టిన కొత్తల్లో కూడా అంతా తానే అయి వ్యవహరించాడని బాహాటంగానే మాట్లాడారు. కొంతమంది ఆశావహులు తన పార్టీ టికెట్లు అమ్ముకున్నాడని కూడా ఆరోపించారు.
ఇటీవలి వరుస పరాజయాల కాలంలోనే ఆలోచించుకునేంత సమయం దొరకడం, ఎవరూ పెద్దగా కాంటాక్ట్‌లోకి రాకపోవడంతో మెగా కుటుంబంతో దూరం పెరిగిందని సమాచారం. ఈమధ్యే చిరంజీవి తను ఉంటున్న ఇల్లును అద్భుతంగా రీ మోడలింగ్ చేయించారట. కొడుకు, కోడలు దగ్గరుండి మరీ దీన్ని ప్రతిష్టత్మకంగా తీసుకుని తీర్చిదిద్దారని తెలుస్తోంది. చూసినవారందరూ కూడా ఆహో ఓహో అంటున్నట్లు విన్న అర్జున్, వెంటనే తను కూడా ఓ ఇల్లు నిర్మిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. మొన్నటి ఇంటర్వ్యూలో ఇంకాస్తా ముందుకెళ్లి ఏ హీరోకి లేనటువంటి ఇల్లు కడుతున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు కూడా.
తను కూడా మెగా ప్లాట్‌ఫాం మీదే ఎంతకాలం నిలబడాలి? తనకంటూ ఓ ఇమేజ్ ఉన్నప్పుడు, ఉనికి కూడా ప్రత్యేకంగానే ఉండాలి కదా అన్న ఆలోచనతోనే కొంత తెగించి మాట్లాడినట్టుగా ఉంది. మలయాళంలో అర్జున్‌కు విపరీతమైన అభిమానజనం ఉన్నారు. అక్కడ ఆయన సినిమాలు బాగా ఆడతాయి. ఈ మధ్య హిందీలో కూడా అర్జున్ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్‌లో బాగా హిట్టయ్యాయి. దాంతో హిందీ జనాలకు కూడా బాగా తెలిసిపోయాడు. గూగుల్‌లో బాగా వెతికిన హీరోల్లో అర్జున్ కూడా ఉన్నాడు. ఇలాంటివన్నీ ప్రోది చేసుకున్న తర్వాతే, ఒంటరిగా ఎదగదలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్మిహితులు చెబుతున్నారు.
ఏదైమైనా, ఆయన అలా ఎదగగలిగితే మంచిదే. కాకపోతే మాత్రమే ఇబ్బంది. ప్రస్తుతం తను చూపిస్తున్న ఆటిట్యూడ్‌తో ముందుముందు మళ్లీ అందరినీ కలుపుకుపోవడం మాత్రం దాదాపు అసంభవం.