తెలంగాణా మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపోల్స్ ప్రచారానికి సోషల్ మీడియాను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. ఆరోపణలను సమర్ధవంతంగా సబ్జెక్ట్ తో ఎదుర్కోవాలని నేతలకు సూచించారు. తెరాస కు 65 లక్షల సభ్యంతం ఉందన్నారు. తెరాస కు సోషల్ మీడియా బలంగా ఉందన్నారు.
ఏ పార్టీకి ఇంత బలం లేదని కేటిఆర్ అన్నారు. కెసిఆర్ ముగ్గులు పంతగులతో ప్రతీ గడపకు ప్రచారం చెయ్యాలి అన్నారు. కెసిఆర్ కూడా ప్రతీ రోజు సోషల్ మీడియా చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యక్రమాలు వాటి పని తీరు తెలుసుకోవడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతుంది అన్నారు. ఆరేడు వందల వార్డుల్లో బిజెపికి అభ్యర్ధుల గతి లేరు అన్నారు. సోషల్ మీడియా ద్వారా నేరుగా మన అభిప్రాయం చెప్పవచ్చు అని ఆయన సూచించారు.
అభ్యర్ధులు లేని బిజెపి ని చూసి తాము ఎందుకు భయపడతామని కేటిఆర్ అన్నారు. తెరాస అంటే తిరుగులేని శక్తి అన్నారు కేటిఆర్. మకర సంక్రాంతితో విపక్షాలకు భ్రాంతి తొలగాలి అన్నారు. ఐదేళ్లలో జలమండలి ముందు ఎప్పుడు ఆందోళనలు జరగలేదు అన్నారు. ఎన్నికల పల్స్ తెలుసుకోవడానికి కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది అన్నారు. ఎల్ ఈడీ లైట్ల ద్వారా తెలంగాణాలో 40 శాతం విద్యుత్ ఆదా అవుతుంది అన్నారు. ఎత్తిపోతల పథకాలు శరవేగంగా పూర్తి అవుతున్నాయి అన్నారు కేటిఆర్.