`పుష్ప‌` సెట్‌లో షాకిస్తున్న బ‌న్నీ లుక్‌!

ఏడు నెల‌ల విరామం త‌రువాత బ‌న్నీ సెట్‌లో సంద‌డి చేయ‌డం మొద‌లుపెట్టారు. అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మారేడుమిల్లిలో డీప్ ఫారెస్ట్‌లో మొద‌లైంది.

ఇటీవ‌లే మారేడుమిల్లి ఫారెస్ట్‌లోకి బ‌న్నీ ఎంట‌ర‌వుతున్నస్టిల్‌ని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 80ల కాలం నాటి క‌థ‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే బ‌న్నీ మేకోవ‌ర్‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్ మాసీవ్‌గా డిజైన్ చేశారు. స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న బ‌న్నీ ఈ మూవీలో అందుకు పూర్తి భిన్నంగా ఊర‌మాస్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. లారీ డ్రైవ‌ర్‌గా బ‌న్నీ పాత్ర‌ని మ‌లిచిన తీరు ఫ్యాన్స్‌కి షాకిస్తోంది.

తాజాగా బ‌న్నీకి సంబంధించిన ఆన్ లొకేష‌న్ పిక్ ఒక‌టి లీక్ అయింది. ఈ ఫొటోలో బ‌న్నీలుక్ షాకిస్తోంది. మ‌ట్టి కొట్టుకు పోయిన డ్రెస్‌లో మాసిన గ‌డ్డంతో బ‌న్నీర‌గ్గ్‌డ్ లుక్‌లో క‌నిపించ‌డం షాకిస్తోంది. పూర్తిగా పుష్ప‌రాజ్‌గా మారిపోయిన అల్లు అర్జున్ లుక్ మూవీపై భారీ అంచ‌నాల్ని పెంచేస్తోంది. ప్ర‌స్తుతం ఆన్ లొకేష‌న్‌లో లీక్ అయిన ఈ పిక్ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది.