అరుదైన రికార్డును క్రియేట్ చేసిన బ‌న్నీ.. పండ‌గ చేసుకుంటున్న ఫ్యాన్స్‌

-

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమా రెండు వారాలు ముగిసిన తర్వాత కూడా రికార్డు వసూళ్లు సాధిస్తూనే ఉంది. బన్నీ గత చిత్రం నా పేరు సూర్య డిజాస్టర్ కావటంతో బన్నీలో పాటు బన్నీ ఫ్యాన్స్‌ కూడా ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. లాంగ్ గ్యాప్‌ తరువాత అల్లు అర్జున్‌ తెర మీద కనిపిస్తుండటం, జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్స్ అందించిన క్రేజీ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచ‌నాల‌ను నిజం చేస్తూ అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుని క‌లెక్ష‌న్స్ ప‌రంగా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇందులో భాగంగానే కేవలం తెలుగు స్టేట్స్‌లోనే కాకుండా..ఓవర్సీస్‌లోనూ బన్ని దుమ్ము దులుపుతున్నాడు. ‘అల వైకుంఠపురములో’ యూఎస్‌లో అరుదైన రికార్డు నెలకొల్పింది. 3.52 మిలియన్ డాలర్ల వసూళ్లతో..నాన్ ‘బాహుబలి’ రికార్డును సాధించింది. బాహుబలి సిరీస్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ యూఎస్‌లో హయ్యిస్ట్ గ్రాసర్‌గా ఉంది. ‘అల వైకుంఠపురములో’ మూవీతో తన బావ రికార్డునే బద్దలుకొట్టాడు బన్ని. కెరీర్ మొదలైన ఇన్నేళ్ళ తర్వాత తొలిసారి ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్నాడు అల్లు వారబ్బాయి. దీంతో అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news