యాడ్స్ ద్వారా అల్లు అర్జున్ సంపాదన అన్ని కోట్లా..?

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈయన తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక పుష్ప సినిమాతో ఇటీవల నార్త్ ఇండియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి నార్త్ సినీ ఇండస్ట్రీ వరకు విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకోవడం గమనార్హం. ముఖ్యంగా పుష్ప సినిమాతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పాలి. బాలీవుడ్లో ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండానే తన సినిమాను విడుదల చేసి అక్కడ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.

ఇకపోతే సినిమాల ద్వారానే కాకుండా ఎన్నో రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని ఎన్నో కంపెనీలు సౌత్ ఇండస్ట్రీలో ఒకరి చేత.. నార్త్ ఇండస్ట్రీలో మరొకరి చేత బ్రాండ్ కు ప్రమోటరుగా నియమించుకొని తమ బ్రాండ్లను ప్రమోట్ చేయించుకుంటూ ఉంటారు కంపెనీ నిర్వాహకులు. అయితే పుష్పా సినిమాతో అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ నార్త్ లో కూడా పెరగడంతో ఈయనను అన్ని భాషలలో ప్రమోటరుగా , బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్న కంపెనీలు కూడా ఉన్నాయి . ఇక ఈ క్రమంలోనే కోకో కోలా, రెడ్ బస్, కే ఎఫ్ సీ, జొమాటో, ఆస్ట్రల్ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఒక్కొక్క ప్రకటనకు గాను ఒక రోజుకి సుమారుగా రూ. 7.5 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

Allu Arjun Zomato Ad: అల్లు అర్జున్ జొమాటో యాడ్‌పై విమర్శలు.. కాస్త చూసుకోవాలిగా బన్నీ..?

ఇక ఇలా అధిక మొత్తంలో యాడ్స్ ద్వారానే రెమ్యునరేషన్ అందుకుంటున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. ఇక ప్రతి సంవత్సరం రూ.100 కోట్లకు పైగా యాడ్స్ ద్వారా సంపాదిస్తున్నారట ఇక సినిమాలలో రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఇటీవల మొన్నటి వరకు రూ.60 కోట్లు తీసుకున్న ఈయన.. నిర్మాతల బంద్ కారణంగా తన పారితోషకాన్ని తగ్గించుకొని పుష్ప సీక్వెల్ కు రూ.30 కోట్లు తీసుకుంటున్నాను అని చెప్పి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాడు.

Read more RELATED
Recommended to you

Latest news