BREAKING: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ భారీ సాయం ప్రకటించారు. ఏకంగా ₹25 లక్షలు విరాళంగా ప్రకటించారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. ఈ మేరకు సోషళ్ మీడియాలో కీలక ప్రకటన చేశారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.
వాయనాడ్‌లో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటం పట్ల నేను చాలా బాధపడ్డానని పేర్కొన్నారు అల్లు అర్జున్. కేరళ ఎల్లప్పుడూ నాకు చాలా ప్రేమను ఇస్తోంది మరియు పునరావాస పనులకు మద్దతుగా కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు ₹25 లక్షలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేయాలనుకుంటున్నానని పోస్ట్ లో వివరించారు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. మీ భద్రత మరియు బలం కోసం ప్రార్థిస్తున్నానన్నారు. కాగా.. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు కేరళలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు వయనాడ్ బాధితులకు అల్లు అర్జున్ భారీ సాయం ప్రకటించారు.
https://x.com/alluarjun/status/1819978015948034542