‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. ఫస్ట్ టైమ్ ఈ సినిమాకి సంబంధించి మోషన్ పోస్టర్ మరియు ఆర్.ఆర్.ఆర్ టైటిల్ లోగో తో వీడియో రిలీజ్ చేశారు. దీంతో ఎప్పటినుండో మెగా మరియు నందమూరి అభిమానులు ఎదురు చూడటం తో తాజాగా విడుదలైన టైటిల్ లోగో మరియు వీడియో పర్వాలేదనిపించింది. అయితే ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ మరియు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారని ముందే రాజమౌళి ప్రకటించడం మనకందరికీ తెలిసినదే.కాగా ఇటీవల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కి సంబంధించి అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ అంటూ వీడియో రిలీజ్ చేశారు. మామూలుగా అయితే అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ అనేసరికి అందరూ రామ్ చరణ్ అడవుల్లో పంచ కట్టుకుని బాణం తగిలించుకుని ఉంటారని ఫిక్స్ అయిపోయారు.
కానీ దానికి అనూహ్యంగా వీడియో లో రామ్ చరణ్ బాక్సింగ్ చేస్తూ, ధ్యానం చేస్తూ ఇలా రక రకాలుగా కనబడటంతో ఈ వీడియో పెద్దగా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. చాలా మంది నెటిజన్లు రామ్ చరణ్ సీతారామరాజు వీడియో చూసి అసలు ఆ క్యారెక్టర్ కి ఈ వీడియో కి సంబంధం ఉందా ? అంటూ ప్రశ్నలు కురిపించారు. రామ్ చరణ్ బాడీ తప్ప వీడియో లో పెద్ద కంటెంట్ ఏమీ లేదని రామ్ చరణ్ క్యారెక్టర్ కి సంబంధించి సినిమా పరంగా చూస్తే ప్లాప్ అయినట్టే…అంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.