బాలకృష్ణ గొప్ప మనసు ఉన్న వ్యక్తి.. 20 ఎకరాలు అడిగారు!

-

ఆంధ్రాలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తాను ఎఫ్.డి.సి. చైర్మన్ గా చాలా కష్టపడినా.. ఆంధ్రాలో సినిమాలు షూట్ చేయాలని ఎంత రిక్వెస్ట్ చేసినా.. ఎవరో ఒకరో ఇద్దరో స్పందించారు తప్ప, మిగిలినవారెవరూ పట్టించుకోలేదని వాపోతున్నారు అంబికా కృష్ణ! తెలుగు హీరోలందరూ తెలంగాణలోనే సినిమాలు చేస్తున్నారు తప్ప ఏపీని ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో… సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో 300 ఎకరాలు కేటాయించారని గుర్తుచేసిన అంబికా కృష్ణ… ఈ విషయంలో స్టూడియోలకు భూకేటాయింపు కోసం నోటిఫికేషన్ జారీ చేయడంతో.. స్టూడియో కట్టేందుకు బాలకృష్ణ 20 ఎకరాలు కావాలని అడిగారని తెలిపారు. ఇదే క్రమంలో ఏవీఎం, మరికొందరు నిర్మాతలు తలా 20 ఎకరాలు కేటాయించాలని దరఖాస్తు చేసుకొన్నారు అని అంబికా కృష్ణ తెలిపారు. అయితే.. అనంతరం ఆ వ్యవహారం ఏమైందనే దానిపై కృష్ణ క్లారిటీ ఇవ్వలేదు!

ఇక తాజాగా నెలకొన్న వివాదాల విషయంలో బాలకృష్ణపై స్పందించారు నిర్మాత అంబికా కృష్ణ. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు 10కి పైగా సినిమాలు నిర్మించానని, ఈ క్రమంలో తనకు బాలయ్య అంటే చాలా ఇష్టం అని తెలిపిన అంబికా కృష్ణ… బాలయ్యది చాల గొప్ప మనసు అని, సమస్యలపై స్పందించే విధానం కూడా గొప్పగా ఉంటుందని ప్రశంసల జల్లులు కురిపించారు. ఇదే క్రమంలో బాలయ్య పద్దతుల గురించి మరింతగా చెప్పిన అంబికా కృష్ణ… ఒకరి వద్ద ఒక మాట, మరొకరి వద్ద ఇంకో మాట చెప్పే లక్షణం బాలయ్యకు లేదని చెప్పారు! ఇలా బాలయ్యపై ఈ స్థాయిలో పాజిటివ్ విషయాలు చెప్పడం… బాలయ్య – నాగబాబు వ్యవహారంలో తన అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్పడమే అని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయపడటం కొసమెరుపు!!

Read more RELATED
Recommended to you

Latest news