అమిత్ లక్ అలా ఉంది!

-

బిగ్ బాస్ సెకండ్ సీజన్ తెలుగులో అమిత్ లక్ కొనసాగుతుంది. లాస్ట్ వీకే దాదాపు అమిత్ పోవాల్సి ఉండగా నూతన్ రీ రీ ఎంట్రీ కారణాల వల్ల అతన్ని టార్గెట్ చేసి హౌజ్ నుండి బయటకు పంపించారు. అంతేకాదు నూతన్ ఒకసారి బయటకు వెళ్లొచ్చాడు కాబట్టి హౌజ్ మెట్స్ లో బలాబలాలు.. ప్రేక్షకులు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నారన్న దాని మీద నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. అందుకే నూతన్ కన్నా అమిత్ కు తక్కువ ఓట్లొచ్చినా లాస్ట్ వీక్ గణేష్ తో పాటుగా నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేశారు.

ఇది లాస్ట్ వీక్ సంగతైతే ఈ వారం అదేనడి గడిచిన శని, ఆదివారాల ఎపిసోడ్స్ చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. ఈవారం కూడా నామినేషన్స్ లో ఉన్న అమిత్ ఈసారి పక్కా వెళ్తాడని అనుకోగా సడెన్ గా యాంకర్ శ్యామలా ఇంటి నుండి బయటకు వచ్చేసింది. అమిత్, శ్యామలా ఇద్దరి మధ్య తక్కువ ఓట్ల తేడా ఉందని అంటున్నారు. అయితే శ్యామలా కౌశల్ కు పూర్తిగా ఎగైనెస్ట్ అవడం.. కౌశల్ ను ఎప్పుడూ టార్గెట్ చేస్తున్న గీతకు శ్యామలా సపోర్ట్ గా ఉండటం లాంటివి జరిగాయి.

అందుకే శ్యామలా ఎలిమినేషన్ లో కౌశల్ ఆర్మీ పాత్ర ఉందని అంటున్నారు. మొత్తానికి 8 మంది ఉన్న ఇంటి సభ్యులలో మరొకరు ఎలిమినేట్ అయ్యారు. ఓ పక్క కౌశల్ కు సపోర్ట్ గా కౌశల్ ఆర్మీ హైదరాబాద్ లో 2కే వాక్ చేశారు. చూస్తుంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్ అయ్యేలానే పరిస్థితులు కబడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news