అక్కినేని అసలు వారసుడు నాగ చైతన్య

-

అక్కినేని నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్టులుగా దేవదాస్. అదేనండి దేవదాస్ మల్టీస్టారర్ సినిమా హీరోలు నాగార్జున, నానిలు అటెండ్ అయ్యారు. కొడుకు ఫంక్షన్ కు నాగార్జున అటెండ్ అవడంలో పెద్ద కిక్ లేదు కాని చైతు వేడుకకు నాచురల్ స్టార్ రావడం సర్ ప్రైజ్ అనిపించింది.

ఇక ఈ వేడుకలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ సినిమా చాలా బాగా వచ్చిందని. తప్పకుండా అభిమానులను ఆశిస్తుందని అన్నారు. ఇక చైతులోని చిలిపి తనం మారుతి బాగా వాడారని. అది కేవలం ఇంట్లో వారికి మాత్రమే తెలుసని అన్నారు. అంతేకాదు ఫీమేల్ లీడ్ సినిమాల్లో నాన్నగారిలా హీరోగా చేయడం చూస్తుంటే నాన్న గారి అసలు వారసుడు చైతునే అని అన్నారు నాగార్జున.

ఎక్కడెక్కడి నుండో చైతుని విష్ చేసేందుకు వచ్చిన అక్కినేని అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు నాగార్జున. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని దర్శక నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే సినిమా టైటిల్ విషయంలో నాగార్జున కన్ ఫ్యూజ్ అయ్యారు. అసలు టైటిల్ శైలజా రెడ్డి అల్లుడు అయితే.. ఒకసారి శైలజా అల్లుడు.. మరోసారి శైలజా రెడ్డి గారి అల్లుడు.. శైలజా రెడ్డి అల్లుడు గారు అని రకరకాలుగా సినిమా టైటిల్ విషయంలో కన్ ఫ్యూజ్ అయ్యాడు నాగ్. అంతేకాదు నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడు కాదు అక్కినేని నాగేశ్వరరావు మనవడు.. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అని అక్కినేని ఫ్యాన్స్ ను ఉత్తేజపరచేలా మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news