Anasuya Bharadwaj : వేశ్యగా మారిన అనసూయ…

-

ప్రముఖ బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట్లో న్యూస్ రీడర్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మారి తన అందచందాలతో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇది ఇలా ఉండగా, తాజాగా సముద్రఖని విమానం అనే ఎమోషనల్ చిత్రంలో నటిస్తున్నారు.

జీ స్టూడియోస్, కిరణ్ కోర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ లో ఈ సినిమా రూపొందుతోంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. విమానం సినిమాలో సముద్రఖని అంగవైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే వీరయ్య అనే తండ్రి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఆమె బర్త్డే సందర్భంగా అనసూయ పాత్ర ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇందులో వేశ్య పాత్రలో అనసూయ కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news