చీరకట్టులో కూడా చుక్కలు చూపిస్తున్న అనసూయ.. ఫొటోస్ వైరల్..!

యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బుల్లితెరపై,అటు వెండితెరపై హవాను కొనసాగిస్తున్న అతి కొద్ది మందిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు.

జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్త పాత్రలో కనిపించి మంచి పేరును తెచ్చుకోవడమే కాకుండా పలు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా అందుకుంది.

మెయిన్ రోల్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది.కానీ, ఆ సినిమాలు అమ్మడుకు పెద్దగా ఫేమ్ ను ఇవ్వలేదు.. తమిళ్‌,మలయాళ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజిగా ఉంది.

సోషల్ మీడియాలో నెటిజెన్లు ఈ అమ్మడిపై చూపించే అటెన్షన్ మరే స్టార్ హీరోయిన్ పై చూపించారు. అయితే.. యాంకర్ అనసూయ కు సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.