అన‌సూయ బాల‌య్య‌కు భ‌లే ట్విస్ట్ ఇచ్చిందే…!

-

జబర్దస్త్ షో తో యాంకర్ అనసూయ కి ఏ రేంజ్ ఫాలోయింగ్ అయితే వచ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఆమె ప్లేస్లో అదే షోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మీ గౌత‌మ్‌కు సైతం అంత‌కు మించిన క్రేజ్ వ‌చ్చింది. త‌న పొట్టి పొట్టి డ్రెస్సులు.. వ‌చ్చి రాని తెలుగుతో అంద‌రిని న‌వ్వించ‌డంతో పాటు హాట్ హాట్ లుక్స్‌తో బాగా క‌వ్వించేది. ఇవ‌న్నీ ఒక‌ ఎత్తైతే.. సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం అంటూ వచ్చే గాసిప్స్ తో రష్మీ చాలా పాపుల‌ర్ అయ్యింది.

బుల్లితెర మీద సూప‌ర్ పాపుల‌ర్ అవ్వ‌డంతో ర‌ష్మీ వెండితెర మీద‌కు కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. వెండితెర‌పై సైతం అందాలు ఆరబోసే హాటెస్ట్ భామగా రష్మీ క్లిక్ అవ్వలేకపోయినా.. జబర్దస్త్ యాంకర్ గా ఈటీవీలో మాత్రం దున్నేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ర‌ష్మీకి వెండితెర‌పై ఓ అదిరిపోయే ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

అది కూడా యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలో… రీసెంట్‌గా బోయపాటి – బాలకృష్ణ కాంబోలో NBK106 మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో గ్లామ‌ర్‌కు స్కోప్ ఉన్న ఓ పాత్ర‌లో న‌టిస్తోంద‌ట‌. ఇంత‌కు అది గ్లామ‌ర్ పాత్రే అయినా క‌థ‌ను మ‌లుపు తిప్పే పాత్ర అని కూడా స‌మాచారం. వాస్త‌వంగా ఈ పాత్ర‌కు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ముందుగా అనసూయ అడిగాడ‌ట‌.

ఆమె ఈ పాత్ర సున్నితంగా తిరస్కరించడంతో.. ఆ ఛాన్స్ రష్మీకి దక్కినట్లుగా చెబుతున్నారు. ఏదేమైనా అన‌సూయ ఇచ్చిన ట్విస్ట్‌తో ఇప్పుడు బాల‌య్య సినిమాలో న‌టించే ఛాన్స్ ర‌ష్మీ కొట్టేసింది. మ‌రి ఈ పాత్ర ఆమెకు ఎంత వ‌ర‌కు పేరు తెస్తుందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news