కేంద్రంలోని బీజేపీ నేతలు ఏపీ సీఎంగా ఉన్న జగన్‌ను చిన్న చూపు చూస్తున్నారు. అప్పాయింట్‌మెంట్ ఇచ్చే విషయం నుంచి హామీల వరకు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ప్రతిపక్షాలు ఆనందం కలిగిం చవచ్చు.. కానీ, రాష్ట్రప్రయోజనాలకు తీవ్ర విఘాతం. గతంలో రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ అధినేత చంద్ర బాబు విషయంలోనూ కేంద్రం ఇదే విధంగా వ్యవహరించింది. దీంతో అప్పటి వైసీపీ లోలోన ఆనందించిం ది. పైగా బాబుపై తీవ్ర విమర్శలు కూడా చేసింది. ఇలా వైసీపి చేసిన పొరపాట్లే ఇప్పుడు టీడీపీ సహా జనసే న వంటి ప్రాంతీయ పార్టీలు కూడా చేస్తే… జగన్‌ను వ్యక్తిగాను, ఓ పార్టీకి అధినేతగానే చూస్తూ.. రాష్ట్ర ప్రయోజ నాలను పక్కన పెడితే.. అంతిమంగా ఏపీ ప్రజలే నష్టపోతారు.
ప్రతి విషయంలోనూ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తరచుగా చంద్ర బా బు, పవన్‌లు సూచిస్తుంటారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తమిళనాడు తరహా పోరా టం చేయాల్సిన అవసరం ఈ ఇద్దరిపైనా ఉందనేది విశ్లేషకుల మాట. ఎన్నికలకు ముందు వరకు జగన్ ఓ పార్టీకి మాత్రమే అధినేత. కానీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా.. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి అధినేత. భారీ మెజారిటీ దక్కించుకుని, ప్రజామోదంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ యన విషయంలో అటు టీడీపీకి, ఇటు జనసేనకు అనేక విభేదాలు ఉండి ఉండొచ్చు. కానీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అన్ని పార్టీలదీ ఒకే మాట, ఒకే బాట కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గతంలో అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో రాష్ట్రాల సీఎంలతో ఢిల్లీలో సద స్సును ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత ఈ సదస్సుకు హాజరై.. రాష్ట్ర సమస్యలను వినిపిస్తున్న సమయంలో ఆమె మైక్‌ను కట్ చేసి, కేవలం ఐదు నిముషాల్లోనే ప్రసంగాన్ని ముగించాలని ఆదేశించారు. దీంతో ఆమె నిర్మొహమాటంగా సదరు సదస్సునుంచి వాకౌట్ చేసి, బయటకు వచ్చి.. రాష్ట్ర సమస్యలు వినే ఓపికలేని ప్రధాని ఈ సదస్సును ఎందుకు ఏర్పాటు చేశారంటూ.. తీవ్రస్థాయిలో ఢిల్లీలోనే విమర్శలు గుప్పించారు.ఆ మెకు తమిళనాడు మొత్తం అండగా నిలిచింది.
అంతేకాదు, జయ విషయంలో పచ్చగడ్డి వేసినా భగ్గుమనే డీఎంకే అధినేత కరుణానిధి సైతం ఈ విషయంలో జయకు తాము అండగా ఉంటామన్నారు. మరి ఈ పాటి రాజకీయ గీతలను ఏపీ నేతలు ఎందుకు దాటకూడదు? పైగా ఇబ్బందులలో ఉన్న రాష్ట్రం అంటూనే ఏపీ నుంచి ఓ సీఎం కేంద్ర వద్దకు వెళ్లి సమస్యలను ఏకరువు పెట్టేందుకు ప్రయత్నిస్తే.. జరిగిన అవమానాన్ని కూడా రాజకీయంగా చూస్తూ.. లబ్ధి పొందాలనే ప్రయత్నం ఈ పార్టీలకు మంచిదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని మూకుమ్మడిగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఏపీకి హితం.. పార్టీలకు జనహితం అంటున్నారు పరిశీలకులు.