ఎన్నోసార్లు నో చెప్పా.. అయినా పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడ్డారు శ్రీకాంత్ చివరికి.. అనితా చౌదరి

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనిత చౌదరి బుల్లితెరపై యాంకర్ గా తన జీవితాన్ని ప్రారంభించడానికి అప్పట్లో ఎన్నో షోలకు యాంకరింగ్ చేసింది తన నటనతో అందంతో వరుస అవకాశాలు అందుకొచ్చుకుంటూ సినీ కెరియర్ లో ముందుకు వెళ్ళింది.. అయితే తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది..

వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనిత చౌదరి యాంకరింగ్ చేస్తున్నప్పుడే అంత హోమ్లీగా ఉంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.. కాకుండా పలు సీరియల్స్ లో నటించిన ఈమె ఎన్నో సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంది.. అయితే తాజాగా తన వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడుతూ తన పెళ్లి ఎలా జరిగిందో చెప్పుకొచ్చింది.. ముఖ్యంగా ఇందులో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ పాత్ర ఎంత ఉందని తెలిపింది..

అనిత చౌదరికి తండ్రి చిన్నతనంలోనే వదిలి వెళ్ళిపోవటంతో కుటుంబ బాధ్యత మొత్తం తనపైన వేసుకోవాల్సి వచ్చిందని దాంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలకు దూరంగా గడపాలని తెలిపింది… కానీ కృష్ణ చైతన్య కనిపించగానే అతనితో పరిచయం ఏర్పడగానే పెళ్లిపై ఇంట్రెస్ట్ వచ్చిందని .. అయినా కానీ పెళ్లి చేసుకోకూడదని చాలా వరకు గట్టిగా అనుకున్నానని .. ఆయన అమెరికాలో ఉండడంతో పెళ్లి చేసుకుంటే.. అక్కడికి తీసుకెళ్లి పోతారు..అప్పుడు నా ఫ్యామిలీ ఒంటరి అయిపోద్దని బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది .

అయితే కృష్ణ చైతన్యకు హీరో శ్రీకాంత్ వాట్స్అప్ కజిన్ అవుతారని దీంతో ఆయన రంగంలోకి దిగి తనకు పలుమార్లు ఫోన్ చేసి కృష్ణచైతన్యమైన పెళ్లి చేసుకోవాలంటే బలవంతం చేశారని తెలిపారు దీంతో ఎవరితో మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యి మూడేళ్లు అందరికీ దూరంగా గడపానని అన్నారు.. అనంతరం ఆయనే వచ్చి డైరెక్ట్ గా ప్రపోజ్ చేసినప్పుడు పెళ్లికి ఒప్పుకున్నానని.. అలా మా పెళ్లి జరిగిందని.. అనిత చౌదరి చెప్పుకొచ్చింది. అలా శ్రీకాంత్ తమ పెళ్లికి పెద్దయ్యారని చెప్పుకొచ్చింది అనిత చౌదరి..

Read more RELATED
Recommended to you

Latest news