అనుపమ అందాల ఆర‌బోత‌… మామూలుగా లేదుగా!

ఇండస్ట్రీకి వచ్చి ఆరేళ్ళు పూర్తి చేసుకున్నా..అందాల హద్దు దాటలేదు అనుపమ పరమేశ్వరన్. తనకంటూ కొన్ని కంచెలు పెట్టుకొని ఆ లోపు గ్లామర్ షో చేస్తూ వస్తుంది. కానీ ఈ మధ్య ఈమెలో కూడా మార్పు వస్తుంది. ఇండస్ట్రీలో నిలబడాలంటే ఖచ్చితంగా అందాల ఆరబోత చేయాల్సిందే అని నిర్ణయానికి వచ్చింది అనుపమ.

అందుకే ఆ మధ్య దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి నటించిన రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది. ఇక తాజాగా తన ఫోటో షూట్ తో సెగలు పుట్టిస్తుంది అనుపమ.

వరుస విజయాలతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత రంగస్థలం సహా మరికొన్ని సినిమాలు చేతిలో నుంచి జారిపోయాయి. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ హోదాకు దూరంగానే ఉంది అనుపమ పరమేశ్వరన్. అన్నింటికీ మించి అందాల ఆరబోతకు దూరంగా ఉండటంతో మిగిలిన హీరోయిన్లు ఆమెను డామినేట్ చేసి ముందుకు వెళ్లిపోయారు. ఇప్పుడిప్పుడే తన పద్ధతులు మార్చుకుంటుంది ఈ కేరళ కుట్టి.

అవకాశాల కోసం అందాల ఆరబోతకు సై అంటుంది. ఈ క్రమంలోనే రౌడీ బాయ్స్ లో అమ్మడు లిప్ లాక్ సన్నివేశాలు చేసింది. ఈ సినిమాలో గతంతో పోలిస్తే కాస్త ఎక్కువ అందాలు ఆరబోసింది అనుపమ. అలా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ చూపు తనవైపు తిప్పుకుంది అనుపమ.

తాజాగా మరోసారి అదిరిపోయే హాట్ ఫోటోషూట్ చేసింది అనుపమ. ప్రస్తుతం సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పెజెస్, బటర్ ఫ్లై సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది అనుపమ.