Big Boss OTT Telugu: ఫైనల్లీ అషురెడ్డి ఔట్..ఇంకా రసవత్తరంగా ‘బిగ్ బాస్’

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ OTT వర్షన్ పదో వారంలో ఎలిమినేషన్ ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు అషురెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ‘బిగ్ బాస్’ నుంచి కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండగా, పదో వారంలో అషురెడ్డి ఎలిమినేట్ అయిపోయింది.

ఆదివారం ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్స్ అందరూ అషురెడ్డికి..అన్నీ వరస్ట్ ట్యాగ్ లైన్స్ ఇచ్చారు. ఇక ఆమె తన గేమ్ గురించి బాగానే ఫోకస్ చేసింది. అయినప్పటికీ చివరకు అషురెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

బాబా భాస్కర్ మాస్టర్ వద్ద ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉండగా, తనకు కావాలని అడిగే ప్రయత్నం చేసింది అషురెడ్డి. అయితే, అషురెడ్డి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, చివరకు అషురెడ్డి పదో వారం ఎలిమినేట్ అయిపోయింది. ఇక ‘బిగ్ బాస్’ నుంచి బయటకు వచ్చిన అషురెడ్డి..ఫైనల్ కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చివరకు ఫైనల్ టాప్ కంటెస్టెంట్స్‌గా అఖిల్, శివ అని తెలిపింది.

 

Read more RELATED
Recommended to you

Latest news