బాహుబలి.. 2.ఓ.. అదే తేడా..!

-

600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ కేవలం 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి రికార్డుల మీద కన్నేయడం విశేషం. ఓవిధంగా చెప్పాలంటే ఇది బాహుబలికి, రోబో సీక్వల్ కు జరుగుతున్న యుద్ధం కాదు రాజమౌళికి, శంకర్ కు మధ్య గెలుపోటముల యుద్ధం. రాజమౌళి కన్నా ఎంతో సీనియర్ అయిన శంకర్ మొదటి సినిమా జెంటిల్ మన్ నుండి రోబో వరకు ఆయన లెక్క వేరేగా ఉండేది.

అయితే 3 ఇడియట్స్ రీమేక్ అదే నంబన్ తెలుగులో స్నేహితుడుగా వచ్చింది. ఆ సినిమా చేయడం పొరపాటని తర్వాత తెలుసుకున్నాడు. ఇక ఐ తెలుగులో మనోహరుడుగా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా శంకర్ మార్క్ చూపించలేకపోయింది. అయితే స్టూడెంట్ నెంబర్ 1 నుండి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన రాజమౌళి బాహుబలితో భారతదేశ చెప్పుకోదగ్గ దర్శకులలో ఒకరని ప్రూవ్ చేసుకున్నాడు.

బాహుబలితో రాజమౌళి సత్తా ఏంటో చూపించాడు. బాహుబలి తర్వాత వస్తున్న 2.ఓ కచ్చితంగా ఆ సినిమా రికార్డులనే టార్గెట్ చేసుకుందని చెప్పొచ్చు. అయితే బాహుబలి సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి పర్ఫెక్ట్ ప్లాన్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యే వారం ముందు నుండి ఓ పండుగ వాతావరణం ఏర్పడింది. కాని 2.ఓ రిలీజ్ విషయంలో ఆ రేంజ్ ప్రమోషన్స్ మిస్ అవుతున్నాయి.

బాహుబలి మేనియాలో దేశమంతా కొట్టుమిట్టాడేలా చేశాడు రాజమౌళి. రిలీజ్ ముందునుండి ఆ సినిమా మీద అందరి దృష్టి ఉండేలా చేశాడు. కాని 2.ఓ భారీ బడ్జెట్ మూవీగా వస్తున్నా బాహుబలి కు తగినట్టుగా పమోషన్స్ లేవన్నది మాత్రం వాస్తవం.

ఈ గురువారం రాబోతున్న 2.ఓ 6800 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా హిట్ టాక్ వస్తే కచ్చితంగా బాహుబలి రికార్డులకు ఎసరు పెట్టే అవకాశం ఉంది. అయితే టాక్ నెగటివ్ గా వస్తే మాత్రం చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Latest news