డిచ్‌పల్లి: నేను చచ్చేలోపు రైతులను ధనవంతులను చేస్తా…కేసీఆర్

-

పేదలను ధనవంతులను చేయడమే తన జీవిత లక్ష్యమని కేసీఆర్ పేర్కొన్నారు. సోమవారం నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చనిపోయేలోపు తెలంగాణలోని రైతులను ధనవంతులను చేస్తా అన్నారు. అదే తన జీవిత లక్ష్యంగా వివరించారు. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఎట్ల పాలించాయో అందరికి తెలిసిందే.. గాయ్‌ గాయ్‌ అరవడం తప్పా.. కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమి లేదని విమర్శించారు. కొన్ని ప్రాంతాల్లో రైతులకు భూములు ఉన్నాయి కానీ, నీళ్లు లేవన్నారు… ఆరునూరైన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రైతుల కాళ్లు తడుపుతానన్నారు. అన్ని పార్టీల నాయకులు వచ్చి ఎదేదో చెబుతారని వారి మాటలకు తెలంగాణ ప్రజలు ఆగం కావద్దని ప్రజలకు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న భాజపా తెలంగాణలో కుంటి సాకులు చెబుతున్నారని గుర్తు చేశారు. ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇవ్వమని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అంటున్నారని, వచ్చేసారి ఆయన అధికారంలో ఉంటే కదా.. అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో పోడు భూములకు పట్టాలతో పాటు రైతుబంధు వర్తింప జేస్తామన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే.. నిజమాబాద్‌ రూరల్‌ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌ను లక్షమెజారిటీతో గెలిపించాలని కేసీఆర్‌ ప్రజలను కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news