ఇదంతా డిజిటల్ యుగం కదా. అప్ డేట్ అవ్వాలి బాస్. అందుకే.. అప్ డేట్ అయ్యారు అంతా. దేంట్లో అంటారా? అదేనండి.. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా. దాని గురించే మనం మాట్లాడుకునేది. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లకు ఎన్నో వలలు వేస్తుంటారు. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అది తెస్తాం.. ఇది తెస్తామంటూ ఊరిస్తారు. ఒక్కోసారి డబ్బు ఆశ కూడా చూపిస్తారు. డబ్బులు పంచుతారు. ఎలాగోలా ఓటర్లను ఆకర్షిస్తుంటారు.
కానీ.. అదంతా పాత ట్రెండ్. ఇప్పుడు అంతా స్మార్ట్ ఫోన్ల యుగం కదా. అందుకే… అభ్యర్థులు ఓటర్లను పేటీఎం ద్వారా లాగుతున్నారు. ఓటేయాలంటూ ఓటర్ల పేటీఎం నెంబర్లు తీసుకొని వాళ్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. అభ్యర్థుల ప్రచారానికి, ర్యాలీలకు, సభలకు రావాలంటూ పేటీఎంలలో డబ్బులు పంపిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో కొన్ని పార్టీల అభ్యర్థులు ఇలా ఓటర్లను ప్రలోభపెడుతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఓటర్ల పేటీఎం నెంబర్లు తీసుకొని వాళ్లకు డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసి ఓటేయాలంటూ విన్నవిస్తున్నారట. అది టెక్నాలజీని ఉపయోగించుకోవడమంటే. వీళ్లు బాగానే అప్ డేట్ అయ్యారు.